సూపర్ హిట్ సినిమాలో హీరో ఎవరో..?

Update: 2018-11-13 08:31 GMT

రెండు నెలల క్రితం ట్రైలర్ తోనే సంచలనాలు సృష్టించి.. భారీ అంచనాలతో తమిళనాట విడుదలైన త్రిష - విజయ్ సేతుపతి 96 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా తమిళనాట సంచలన రికార్డులు నమోదు చేసింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, త్రిషల కెమిస్ట్రీకి అందరూ పడిపోయారు. ఆన్ లైన్ లో హెచ్ డి ప్రింట్ అందుబాటులోకి రావడం... టీవీల్లో దీపావళి కానుకగా ప్రసారం చేసినప్పటికీ.. ఈ సినిమాకు థియేటర్స్ లో డిమాండ్ తగ్గలేదంటే ఆ సినిమా ఏ రేంజ్ హిట్ అర్ధమవుతుంది. ఇక టీవీల్లో, ఆన్ లైన్ లో చూసిన ప్రేక్షకులు 96 గురించి సోషల్ మీడియాలో పొగడమే కాదు... సినిమా సూపర్ అంటూ ఉచిత ప్రచారం చేస్తున్నారు.

నాని హీరోగా తీస్తాడనుకున్నా...

అంత పెద్ద హిట్ అయినా ఆ సినిమా తెలుగులోకి ఎప్పుడొస్తుందో గాని.. తెలుగులో సగం మంది 96ని తమిళంలో వీక్షించేసారు. అయితే తెలుగులో దిల్ రాజు ఈ సినిమాని రీమేక్ చేస్తాడని.. నాని హీరోగా సమంత హీరోయిన్ గా నటిస్తుందని ప్రచారం జోరుగా జరిగింది. ఇక సినిమా చూసిన నాని సినిమాలో హీరోగా చేయలేనని... నిర్మాతగా భాగస్వామి అవుతానన్నాడు. ఎందుకంటే 96 సినిమాలో 38 ఏళ్ల వయసులో పోగొట్టుకున్న ప్రేమను విడిపోయిన తన లవర్ ని చానళ్ల తర్వాత స్కూల్ రీ యునియన్ లో కలుసుకుంటాడు. కథ అలా జరుగుతున్న మధ్యలో ఆనాటి జ్ఞాపకాలన్నీ వెంటాడుతూ వస్తాయి. ఇక ఆఖరిలో ఎమోషనల్ టచ్ ఉండే క్లైమాక్స్. మరి అలాంటి 38 ఏళ్లు ఉన్న పాత్రలో నటించేందుకు తెలుగులో హీరోలెవరూ ముందుకు రావడమే లేదా..? లేదంటే ఈ సినిమాని అందరూ తమిళంలోనే ఆన్ లైన్ లో, టీవీల్లో చూసేసారు కాబట్టి ఇక్కడ రీమేక్ చెయ్యడం ఎందుకనుకుంటున్నారా? అనేది అర్ధం కానీ విషయం అది.

Similar News