తేజ్ జ‌డ్జ్ మెంట్ ఫెయిల్..!

Update: 2018-07-09 06:32 GMT

రీసెంట్ గా రిలీజ్ అయిన 'తేజ్ ఐ లవ్ యూ' చిత్రానికి మిక్స్డ్ టాక్ రావడంతో సాయి ధరమ్ తేజ్ జ‌డ్జ్ మెంట్ పై అనుమానాలు త‌లెత్తుతున్నాయి. 'తొలిప్రేమ' సినిమాను తీసిన కరుణాకరణ్ డైర‌క్ష‌న్ లో తేజ్ సినిమా అంటే అందరు అంచనాలు పెంచుకున్నారు. టైటిల్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో సినిమాపై మరింత అంచనాలు పెరిగాయి. కానీ సినిమా చూస్తే అందుకు వ్యతిరేకంగా ఉంది. సినిమా చాలా రెగ్యులర్ గా ఉందని టాక్ వినిపిస్తుంది.

కథలు ఎంచుకోలేకపోతున్నాడా..?

తేజ్ గత చిత్రాలతో పోల్చుకుంటే ఈ సినిమాకు ఓపెనింగ్స్ కూడా చాలా డల్ గా ఉన్నాయి. దీంతో ఈ మెగా హీరోకి కథలు విషయంలో క్లారిటీలేదనే కామెంట్స్ వస్తున్నాయి. దిల్ రాజు, అల్లు అరవింద్ బ్యానర్ లో సినిమాలు చేసి హిట్స్ అందుకున్న తేజ్.. బయట బ్యానర్ లో ఎందుకు హిట్ అందుకులేకపోతున్నాడు? ఎందుకంటే వారు స్టోరీని నమ్ముకునే సినిమాను తీస్తారు. స్టోరీ నచ్చకపోతే సినిమాను తీయరని టాక్ ఉంది. ఇప్పుడున్న కాంపిటేషన్ లో తేజ్ కచ్చితంగా హిట్ కొట్టి తీరాలి.. లేకుంటే కష్టమని చెబుతున్నారు సినీ పండితులు. కథల ఎంపిక విషయం తేజ్ కొంచం జాగ్ర‌త్త‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు మెగా అభిమానులు. చూద్దాం తర్వాత సినిమాలతో తేజ్ మనల్ని ఎలా మేపిస్తాడో.

Similar News