'తేజ్‌' అందరినీ అలరిస్తుంది

Update: 2018-06-09 09:18 GMT

'పిల్లా నువ్వులేని జీవితం', 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌', 'సుప్రీమ్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాలతో ప్రేక్షకుల్లో, అభిమానుల్లో మంచి క్రేజ్‌ని సంపాదించుకున్న సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ తాజాగా 'తేజ్‌' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అందాల తార అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై 'తొలిప్రేమ' ఫేమ్‌ ఎ. కరుణాకరన్‌ దర్శకత్వంలో కె.ఎస్‌. రామారావు, వల్లభ నిర్మించిన ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ 'తేజ్‌'. ఐ లవ్‌ యు అనేది ఉపశీర్షిక. ప్రముఖ సంగీత దర్శకుడు గోపీ సుందర్‌ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని మొదటి పాటని రీసెంట్‌గా రిలీజ్‌ చేసిన విషయం అందరికీ తెల్సిందే. కాగా ఈ చిత్రంలోని 'నచ్చుతున్నాదే..' సెకండ్‌ సాంగ్‌ని జూన్‌ 8న హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని లాట్‌ మొబైల్స్‌ షోరూమ్‌లో రిలీజ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో సాయిధరమ్‌ తేజ్‌, హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌, నిర్మాత కె.ఎస్‌. రామారావు, దర్శకులు ఎ. కరుణాకరన్‌, లాట్‌ మొబైల్స్‌ ఎండి స్వప్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం డిటిఎస్‌ మిక్సింగ్‌ జరుపుకుంటోన్న ఈ చిత్రం జూన్‌ 29న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతుంది.

అప్పుడు మామ, ఇప్పుడు అల్లుడు...

సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ... ‘‘ఈ సాంగ్‌లో హీరోయిన్‌ అనుపమ నన్ను టీజ్‌ చేస్తుంటుంది. చాలా చాలా బాగుంటుంది. అందరూ ఈ పాటని బాగా ఎంజాయ్‌ చేస్తారు. సినిమా అంతా చాలా కలర్‌ఫుల్‌గా వుంటుంది. మంచి సినిమా చేశాం. డెఫినెట్‌గా ఈ చిత్రం అందర్నీ అలరిస్తుంది.’’ అన్నారు. దర్శకుడు ఎ. కరుణాకరన్‌ మాట్లాడుతూ... ''నా ఫస్ట్‌ ఫిలిం 'తొలిప్రేమ'తో పవన్‌ అవకాశం ఇచ్చి నన్ను దర్శకుడ్ని చేశారు. మళ్ళీ వారి మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ 'తేజ్‌' సినిమాకి అవకాశం ఇచ్చాడు. సినిమా చాలా బాగా వచ్చింది. తేజ్‌, అనుపమ ఇద్దరూ ఎక్స్‌ లెంట్‌గా చేశారు. ఫీల్‌గుడ్‌ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ఇది. ప్రతి ఒక్కరికీ నచ్చేవిధంగా వుంటుంది.’’ అని పేర్కొన్నారు.

ఆడియో రిలీజ్ కి మోగాస్టార్...

చిత్ర నిర్మాత కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ - ‘‘సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పెయిర్‌ బ్యూటిఫుల్‌గా వుందని అందరూ చెప్తున్నారు. సినిమాలో ఇద్దరూ పోటీపడి నటించారు. 'తేజ్‌' ఐ లవ్‌ యు సినిమా ఆడియోను జూన్‌ 9న గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఈ ఫంక్షన్‌కి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సాయిధరమ్‌కి ఈ చిత్రం సూపర్‌హిట్‌ అవుతుంది.’’ అన్నారు. హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ మాట్లాడుతూ - ''తేజ్‌' చిత్రంలోని 'నచ్చుతున్నాదే' నా ఫేవరేట్‌ సాంగ్‌. అందరికీ నచ్చుతుంది. సినిమా విడుదలకు చాలా ఎగ్జైట్‌మెంట్‌తో వున్నాను.’’ అని పేర్కొన్నారు.

Similar News