ఆకట్టుకుంటున్న తేజ్ ఐ లవ్ యూ ట్రైలర్

Update: 2018-06-26 09:04 GMT

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా, అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో కె.ఎస్‌.రామారావు నిర్మిస్తున్న చిత్రం 'తేజ్‌'. ఐ లవ్‌ యూ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా జూలై 6న విడుద‌ల‌వుతుంది. సోమ‌వారం ఈ చిత్ర ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, డిస్ట్రిబ్యూట‌ర్ దిలీప్ టాండ‌న్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. 'తేజ్ ఐ ల‌వ్ యూ' కాంటెస్ట్ విజేత‌ల‌కు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్‌, నిర్మాత కె.ఎస్‌.రామారావు బ‌హుమ‌తుల‌ను అందించారు.

‘అభిలాష’ ట్రెండ్ మళ్లీ...

నిర్మాత కె.ఎస్‌.రామారావు మాట్లాడుతూ...''నాకు తేజ్ డేట్స్ ఇచ్చి ఏడాదిన్న‌ర స‌మ‌యం వ‌ర‌కు మంచి క‌థ‌లు దొర‌క‌లేదు. ఆ స‌మ‌యంలో సాయిధ‌ర‌మ్ నాకు ఫోన్ చేసి నేనొక క‌థ విన్నాను. నాకు న‌చ్చింది. మీరు కూడా వినండి.. మీకు న‌చ్చితే సినిమా చేద్దాం అన్నారు. క‌రుణాక‌రన్ వ‌చ్చి క‌థ చెప్పాడు. నాకు న‌చ్చ‌డంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది. క‌థ‌లో మంచి ఫీల్ ఉంది. యూత్‌ను బాగా ఆక‌ట్టుకుంటుంద‌ని అనుకున్నాను.'' అన్నారు. హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ మాట్లాడుతూ - ''అభిలాష‌' సినిమా ప‌బ్లిసిటీ పి.ఆర్‌.ఒలు, జ‌ర్న‌లిస్టుల‌తోనే స్టార్ట్ అయ్యిందని విన్నాను. మ‌ళ్లీ అలాగే పి.ఆర్‌.ఒ ల స‌మ‌క్షంలో ట్రైల‌ర్ విడుద‌ల కావ‌డం ఆనందంగా ఉంది. అంద‌రికీ సినిమా న‌చ్చుతుందనే న‌మ్మ‌కంతో ఉన్నాను'' అన్నాను.

Similar News