'తేజ్‌' ఐ లవ్‌ యూ....!

Update: 2018-05-31 10:41 GMT

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ మూవీ మేకర్స్‌ పతాకంపై ఎ. కరుణాకరన్‌ దర్శకత్వంలో ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌. రామారావు, వల్లభ నిర్మిస్తున్న యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'తేజ్‌'. ఐలవ్‌యు అనేది ఉపశీర్షిక. జూన్ 29న ఈ సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం రీరికార్డింగ్‌ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌ ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌. రామారావు, దర్శకుడు ఎ. కరుణాకరన్‌ పాల్గొన్నారు.

జూన్‌ 9న ఆడియో విడుదల...

కె.ఎస్‌. రామారావు మాట్లాడుతూ - ‘‘ఇదొక లవ్‌, ఫ్యామిలీ డ్రామా. స్వీట్‌గా, ఈస్థటిక్‌గా వుంటుంది. డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌, సెన్సార్‌ కట్స్‌ లేకుండా నీట్‌గా, క్లీన్‌గా సెంటిమెంట్‌, ఎమోషన్స్ ని కలగలిపి కరుణాకరన్‌ ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా చిత్రీకరించారు. చక్కని కుటుంబ కథా చిత్రాలు యూత్‌కి నచ్చేవిధంగా తీసే దర్శకుడు కరుణాకరన్‌ 'తొలిప్రేమ' నుండి ఆయనకొక ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. కరుణాకరన్‌తో నేను రెండో సినిమా తీస్తున్నాను. మొదటి సినిమా 'వాసు'. ప్రజాదరణతో పాటు మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అయ్యింది. ఉత్తమ ఫ్యామిలీ కథా చిత్రంగా నంది అవార్డుని కూడా గెలుచుకుంది. అలాగే ఈ 'తేజ్‌' కూడా చక్కని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం అవుతుంది. సాయిధరమ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌ ఇద్దరూ బ్యూటిఫుల్‌గా నటించారు. గోపీసుందర్‌ ఐదు పాటలకి అద్భుతమైన మ్యూజిక్‌ ఇచ్చాడు. రామజోగయ్య శాస్త్రి, సాహితి, రాంబాబు, రెహమాన్‌లు ఫెంటాస్టిక్‌ లిరిక్స్‌ రాశారు. జూన్‌ 2న ఈ చిత్రంలోని మొదటి పాటని క్రికెట్‌ మ్యాచ్‌ ద్వారా రిలీజ్‌ చేస్తున్నాం. 9వ తేదీన జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆడియో ఫంక్షన్‌ని చాలా గ్రాండ్‌గా జరపనున్నాం. ప్రస్తుతం రీరికార్డింగ్‌ వర్క్‌ జరుగుతోంది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని జూన్‌ నెలాఖరులో తేజ్‌ చిత్రాన్ని వరల్డ్‌ వైడ్‌గా రిలీజ్‌ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం'' అన్నారు.

లవ్, ఫ్యామిలీ ఎంటర్ టైనర్...

చిత్ర దర్శకుడు ఎ. కరుణాకరన్‌ మాట్లాడుతూ - ‘‘నేను ఏదైతే అనుకున్నానో.. ఎలాంటి సినిమా చెయ్యాలనుకున్నానో ఆవిధంగా కె.ఎస్‌.రామారావుగారు బ్యూటిఫుల్‌గా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్‌ చేశారు. ఈ బేనర్‌లో ఇంత మంచి సినిమా చేసినందుకు చాలా గర్వంగా వుంది. ఇది 10వ సినిమా. సాయిధరమ్‌ తేజ్‌, అనుపమతో ఫస్ట్‌ టైమ్‌ వర్క్‌ చేస్తున్నాను. ఇద్దరూ సూపర్బ్‌ గా చేశారు. సినిమా ఎక్స్‌ ట్రార్డినరీగా వచ్చింది. క్యూట్‌ లవ్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందిన 'తేజ్‌' చిత్రం అందరికీ నచ్చుతుంది. గోపీసుందర్‌ వండ్రఫుల్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. ఆండ్రూ ప్రతి ఫ్రేమ్‌ని బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. మా టెక్నీషియన్స్‌ అందరికీ థాంక్స్‌. అలాగే రామారావుగారికి నా కృతజ్ఞతలు'' అన్నారు

Similar News