‘ట్యాక్సీవాలా’ రిలీజ్ పై క్లారిటీ..!

Update: 2018-08-15 07:23 GMT

నిజానికి 'గీత గోవిందం' కన్నా ముందే విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ అది జరగలేదు. 'టాక్సీవాలా' షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ చేసుకుని..మే 18న రిలీజ్ అంటూ ప్రెస్ మీట్ లో కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఉన్నట్టుండి సినిమా వాయిదా పడిపోయింది. ఆ తర్వాత జూన్ లో రిలీజ్ అవుతుందన్నారు కానీ ఆగస్టు కూడా వచ్చేసింది. ఇంతవరకు ఈ సినిమా ఊసే లేదు.

క్లారిటీ ఇచ్చిన విజయ్

ఈలోపు ‘ట్యాక్సీవాలా’ను పక్కన పెట్టేసి 'గీత గోవిందం'ను రిలీజ్ చేశారు. 'టాక్సీవ్వాలా' టీం నుండి కూడా ఎవరూ ఈ సినిమాపై స్పందించకపోవటంతో.. అసలు ఈ సినిమా రిలీజ్ అవుతుందా? అయితే ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న ప్రశ్నలు ప్రేక్షకులని వెంటాడుతున్న టైంలో హీరో విజయ్ ఈ సినిమా గురించి నోరు విప్పాడు. నిన్న జరిగిన 'గీత గోవిందం' ప్రమోషన్స్ లో ‘ట్యాక్సీవాలా’ పై క్లారిటీ ఇచ్చాడు.

మళ్లీ పని చేయిస్తున్నందునే...

గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పనుల్లో జాప్యం వల్లే సినిమా వాయిదా పడిందన్నాడు. అంతకుముందు చేసిన వర్క్ మాకు నచ్చకపోవటంతో మళ్లీ మరోసారి మొత్తం పనిని చేయిస్తున్నామని అందుకే లేట్ అవుతుందని అని ఆయన అన్నాడు. ఎటువంటి హడావిడి లేకుండా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నామని..అంతా ఓకే అనుకున్నాక కొన్ని రోజుల్లోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విజయ్ తెలిపాడు. ఈ సినిమా ఎప్పుడు వచ్చినా హిట్ అవుతుందనే నమ్మకం తనకు ఉందని విజయ్ అన్నాడు.

Similar News