థియేటర్స్ లో విడుదల చెయ్యకుండా... డైరెక్ట్ గా..?

Update: 2018-08-25 08:31 GMT

ప్రస్తుతం యువ హీరోల్లో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్న హీరో విజయ్ దేవరకొండ. వరస హిట్స్ అందుకుంటున్న యంగ్ హీరోలకు కూడా రాని క్రేజ్ ఒక్క విజయ్ దేవరకొండ సొంతమైంది అరుణ్ రెడ్డి సినిమాతో. అర్జున్ రెడ్డి సెన్సేషన్ హిట్ అయితే... తాజాగా గీత గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక విజయ్ మార్కెట్ పరిధి ఒక్కసారిగా 50 కోట్ల క్లబ్బులోకి వెళ్లిపోయింది. ఇక విజయ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లు విజయ్ క్రేజ్ తో కచ్చితంగా అదరగొట్టే బిజినెస్ జరగడం ఖాయం. అలాగే మరో రెండు హిట్స్ పడ్డాయి అంటే గనక విజయ్ స్టార్ హీరోలు సరసన చేరినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అయితే అంత క్రేజున్న విజయ్ కి ఇప్పుడు తన సినిమా ఒకటి కాస్త తలనొప్పిగా మరింది.

భారీ ధరకు డిజిటల్ హక్కులు అమ్మేసి..

గీత గోవిందం కన్నా ముందు విడుదల కావాల్సిన టాక్సీవాలా సినిమా గ్రాఫిక్స్ పనుల వలన షూటింగ్ ఎపుడో కంప్లీట్ అయినా విడుదల లేట్ అవుతూ వచ్చింది. రాహుల్ డైరెక్షన్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా గత వారంలో కొన్ని సీన్స్ యూట్యూబ్ లో లీకైన విషయం తెలిసిందే. జులై లో విడుదల చేద్దామనుకున్న సినిమా కాస్తా... ఆగస్టుకి తర్వాత సెప్టెంబర్ కి వాయిదా అవుతూ వచ్చింది. అయితే ఇలా థియేటర్స్ లో విడుదల చేసేకన్నా ఈ సినిమా ని భారీ రేటుకు డీజిటల్ హక్కుల కింద అమ్మేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో టాక్సీవాలా టీమ్ ఉందట. ఆమెజాన్ లేదా నెట్ ఫ్లిక్స్ కి గాని టాక్సీవాలా హక్కులను అమ్మాలని మేకర్స్ డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది.

అధికారిక ప్రకటనే తరువాయి..!

మరి యువి అండ్ గీత ఆర్ట్స్ వారు ఇలా థియేటర్స్ లో సినిమా విడుదల చేసేకన్నా డిజిటల్ గా అంటే ఆమెజాన్ లేదా నెట్ ఫ్లిక్స్ కి అమ్మేసి క్యాష్ చేసుకోవాలని భావించడం మాట ఎలాగున్నా ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ టాక్సీవాలా నిర్మతలు మాత్రం ఈ డెసిషన్ కే కట్టుబడి ఉండేలా ఉన్నారట.

Similar News