టాక్సీవాలా కొత్త రికార్డు

Update: 2018-10-26 07:30 GMT

పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాలతో కమర్షియల్ స్టామినా ఉన్న స్టార్ హీరోగా ఎదిగిన విజ‌య్‌ దేవరకొండ నటించిన తాజా చిత్రం టాక్సీవాలా. జిఏ2 పిక్చ‌ర్స్ మ‌రియు యు.వి. క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ కె ఎన్ ఈ చిత్రంతో నిర్మాతగా....రాహుల్ సంకృత్యాన్ దర్శకుడిగా పరిచయమౌతున్నారు. నవంబర్ 16న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కాగా ఐఎండీబీ మోస్ట్ ఆంటిసిపేటెడ్ ఇండియన్ మూవీస్ రియల్ టైం పాపులారిటీ లో టాక్సీవాలా 7వ స్థానం దక్కించుకోవడం విశేషం. టాలీవుడ్ నుంచి టాప్ టెన్ లో టాక్సీవాలా చిత్రం మాత్రమే ఉండడం విశేషం. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్, జిఏ2 పిక్చర్స్ కున్న క్రేజ్ తో ఈసినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ చిత్ర టీజర్ ఇంట్రస్టింగ్ గా ఉండడంతో సినిమాకు క్రేజ్ బాగా పెరిగింది. గీత గోవిందం మేనియాతో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగా జరగడం... అబ్బురపరిచే గ్రాఫిక్స్ ఉండడంతో పాపులారిటీ అమాంతం పెరిగింది. సస్పెన్స్, సైంటిఫిక్ థ్రిల్లర్ కథాంశాన్ని హిలేరియస్ కామెడీతో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. ఇప్పటికే పబ్లిసిటీలో దూసుకుపోతున్న ఈ చిత్రంలోని సింగిల్ ను రేపు విడుదల చేస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేసుకుని పోస్ట్‌ ప్రొడ‌క్ష‌న్ శరవేగంగా జ‌రుపుకుంటోంది.

Similar News