'టాక్సీవాలా'కు ఒకే ఒక్క ప్లస్ పాయింట్ ఇదే..!

Update: 2018-11-03 06:41 GMT

ఈకాలంలోనూ సెంటిమెంట్స్ ఎవరు నమ్మట్లేదు చెప్పండి. సెంటిమెంట్స్ నమ్మొద్దు అని సినిమా వాళ్లే సినిమాల్లో చెప్పి బయట సెంటిమెంట్స్ ని తెగ ఫాలో అవుతుంటారు. ఇది అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్నా మన టాలీవుడ్ లో కొంచం ఎక్కువే అని చెప్పాలి. వారు చేసిన సినిమాలన్నీ ఫెయిల్ అవుతుంటే వారిని ఐరన్ లెగ్ అనడం.. హిట్ అయితే గోల్డెన్ అనడం మన ఇండస్ట్రీ వాళ్లకి కామన్ అయిపోయింది. ఇలా హీరోయిన్స్ విషయంలో ఎక్కువ జరుగుతుంటాయి. తెలుగులో 'ఎవడే సుబ్రహ్మణ్యం', 'కల్యాణ వైభోగమే', 'మహానటి' వంటి చిత్రాల్లో నటించిన మాళవిక నాయర్ కు ప్రేక్షకుల్లో మంచి పేరు ఉంది. ఇప్పటివరకు ఆమె నటించిన సినిమాలన్నీ మంచి పేరు తెచుకున్నవే.

గెస్ట్ రోల్ లో మాళవిక నాయర్

ఈ నేపథ్యంలో ఆమె లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' లో ఒక గెస్ట్ రోల్ లో నటించిందట. ఆమె ఈ సినిమాలో ఉంది కాబట్టి ఈమె రూపంలో 'టాక్సీవాలా'కు కలిసి వస్తుందని అందరూ భావిస్తున్నారు. రెండు నెలల కిందట ఈ సినిమా మొత్తం బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ పైరేటెడ్ వర్షన్ చుసిన కొంతమంది సినిమా ఫ్లాప్ అంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఈనెల 16న విడుదల అవ్వబోతున్న ఈ సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయినా మాళవిక నాయర్ రూపంలో హిట్ అవుతుందని భావిస్తున్నారట. మాళవిక కూడా ఈ సినిమాతో సక్సెస్ అందుకుని గోల్డెన్ లెగ్ అని ప్రూవ్ చేసుకోవాలని చూస్తుంది.

Similar News