తాప్సీ నటనపై సెలబ్రిటీలు ప్రశంసల జల్లు

Update: 2018-09-13 07:37 GMT

టాలీవుడ్ లో సక్సెస్ లు లేకపోవచ్చు కానీ బాలీవుడ్ లో వరస సినిమాలతో తన జోరు చూపుతుంది చొట్ట బుగ్గల సుందరి తాప్సీ. కెరీర్ స్టార్టింగ్ లో యాక్టింగ్ తో ఇబ్బంది పడ్డా ఆ తర్వాత బాగానే లాకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసే సినిమాల్లో యాక్టింగ్ స్కోప్ ఉండటంతో తన టాలెంట్ మొత్తం బయట పెడుతుంది ఈ అమ్మడు. బాలీవుడ్ లో 'పింక్' అనే సినిమా ఆమె యాక్టింగ్ గురించి ఇప్పటికి మాట్లాడుకుంటారు. ఆ సినిమాను చూసిన తెలుగు ప్రేక్షకులు కూడా ముక్కు మీద వేలు వేసుకున్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు.

తన స్ట్రాంగ్ పెర్ఫార్మన్స్ తో అందరి మనసులు గెలుచుకున్న తాప్సీ లేటెస్ట్ గా 'మన్మర్జియాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాలో అభిషేక్ బచ్చన్ - విక్కీ కౌశల్('సంజు' లో రణబీర్ ఫ్రెండ్) ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఆ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ అందుకుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాను రీసెంట్ గా టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శించారట.

రొమాంటిక్ కామెడీగా సాగే ఈకథలో తాప్సీ తన నటనతో ఇద్దరూ హీరోలను డామినేట్ చేసిందట. సెలబ్రిటీలు తాప్సీ నటనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి ఎంతలా ఆకట్టుకుందో తెలియాలంటే ఈనెల 14 వరకు ఆగక తప్పదు. ఇలా తన యాక్టింగ్ స్కిల్స్ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకుంటుంది డింపుల్ బ్యూటీ. మరి ఆమె నటనతో కేవలం సెలబ్రిటీలనే ఆకట్టుకుందా? లేదా మనల్ని కూడా ఆకట్టుకుంటుందా.. చూద్దాం.

Similar News