తాప్సి తో నటించనన్న హీరోస్ ఎవరో?

సౌత్ లో వర్కౌట్ అవ్వక బాలీవుడ్ చెక్కేసి.. కథానాయిక పాత్రలకు ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ.. బాలీవుడ్ లో వరస హిట్స్ కొడుతున్న తాప్సి తాజాగా థప్పడ్ చిత్రంతో [more]

Update: 2020-03-02 05:10 GMT

సౌత్ లో వర్కౌట్ అవ్వక బాలీవుడ్ చెక్కేసి.. కథానాయిక పాత్రలకు ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ.. బాలీవుడ్ లో వరస హిట్స్ కొడుతున్న తాప్సి తాజాగా థప్పడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. తాజాగా తాప్సి ఓ ఇంటర్వ్యూ లో మట్లాడుతూ.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకయ్యే బడ్జెట్.. ఓ హీరోగారి పారితోషకం అంతా కూడా ఉండదు. అందుకే ఎక్కువగా కథానాయకులు కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల సినిమాలు చెయ్యాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి మారుతుంది అని చెబుతుంది తాప్సి.

అంతేకాకుండా ఇప్పటివరకు తన కెరీర్ లో జరిగిన విషయాలను తలచుకుంటూ.. తాప్సి హీరోయిన్ అనగానే మేము చెయ్యమని చెప్పిన హీరోలు చాలామంది ఉన్నారు. ఆఖరుకి ఒకటి రెండు సినిమాలు చేసిన హీరోలు కూడా నాతొ నటించడానికి మొహం చాటేశారు.. ఎందుకంటే.. తనతో కలిసి నటిస్తే తమకన్నా ఎక్కువగా తాప్సి ఎక్కడ గ్లామర్ గా హైలెట్ అవుతుందో అని.. అందరి దృష్టి నా మీదే ఉంటుంది అని వారు భయపడడం వలనే నాతో కలిసి నటించలేదు అని చెబుతుంది. మరి తాప్సి చెప్పిన హీరోలు సౌత్ హీరోలో? లేదంటే బాలీవుడ్ హీరోలో? అంటూ అప్పుడే హాట్ హాట్ చర్చలకు తెర లేపుతున్నారు సోషల్ మీడియా ఫాన్స్.

Tags:    

Similar News