‘సరిహద్దు’ సైనికుడిగా తనీష్

మనిషికి, మనిషికీ.. దేశాలకు, ప్రాంతాలకు మధ్య కొన్ని హద్దులు ఉంటాయి. ఎవరి పరిధిలో వాళ్లున్నంత వరకూ అవి సరిగ్గానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ సరిహద్దులు అతిక్రమిస్తే [more]

Update: 2019-01-16 11:45 GMT

మనిషికి, మనిషికీ.. దేశాలకు, ప్రాంతాలకు మధ్య కొన్ని హద్దులు ఉంటాయి. ఎవరి పరిధిలో వాళ్లున్నంత వరకూ అవి సరిగ్గానే ఉంటాయి. కానీ ఒక్కసారి ఆ సరిహద్దులు అతిక్రమిస్తే సంఘర్షణ మొదలవుతుంది. దేశాలు, ప్రాంతాల మధ్య ఈ సరిహద్దు సంఘర్షణలు తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు.. ఒక్కోసారి అది జాతీయ సమస్యగానూ మారొచ్చు.. అలా మారకుండా చూసే శక్తి ఆర్మీ. సైనికుడు సరిహద్దుకు కాదు దేశానికే రక్షకుడు. ఇదే కాన్సెప్ట్ తో యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ తనీష్ హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. తనీష్ గత సినిమా ‘రంగు’తో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న కార్తికేయ ఈ చిత్రానికి దర్శకుడు. అంటే ‘రంగు’ కాంబినేషన్ రిపీట్ అవుతోందన్నమాట.

రెండు భాషల్లో…

నేషనలైజ్డ్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న ఈ చిత్రం టైటిల్ కూడా ‘సరిహద్దు’. తెలుగుతో పాటు హిందీ భాషలోనూ విడుదల చేయబోతోన్న ‘సరిహద్దు’ మూవీ షూటింగ్ మార్చి 16 నుంచి ప్రారంభం కాబోతోంది. టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండబోతోన్న ఈ చిత్రంలో తెలుగుతో పాటు హిందీ నటులు కూడా నటించనున్నారు. ప్రస్తుతం టైటిల్ తోనే ఆకట్టుకుంటోన్న ఈ టీమ్.. సినిమాకు సంబంధించిన వివరాలతో పాటు ఇతర ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కు సంబంధించిన వివరాలను ఈ నెలాఖరులో తెలియజేయబోతున్నారు.

Tags:    

Similar News