ఈసారి తట్టా బుట్టా సర్దుకోవడమే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది తమన్నా. తమన్నాతో పాటు ఇండస్ట్రీలో ఉన్న కాజల్ అగర్వాల్ కుర్ర హీరోలతోనూ సినిమాలు చేస్తూ బిజీ అవుతుంటే.. [more]

Update: 2019-01-10 06:44 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోయిన్స్ లిస్టులోకి చేరిపోయింది తమన్నా. తమన్నాతో పాటు ఇండస్ట్రీలో ఉన్న కాజల్ అగర్వాల్ కుర్ర హీరోలతోనూ సినిమాలు చేస్తూ బిజీ అవుతుంటే.. తమన్నా మాత్రం సీనియర్ హీరోలతోనే సర్దుకుపోతుంది. అలాగే తమన్నా నటించిన క్వీన్ రీమేక్ దట్ ఈజ్ మహాలక్ష్మి సినిమా మీద ఎలాంటి అంచనాలు లేవు. ఇక తమన్నా ప్రస్తుతం ఫేడవుట్ హీరోయిన్స్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇంకా శ్రియ పెళ్లయ్యాక కూడా ఒకటో అరా అవకాశాలు దక్కించుకుంటుంది. కానీ తమన్నా పరిస్థితి మాత్రం ఏం బాగోలేదు. ఇక తమన్నా లేటెస్ట్ చిత్రం ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్టేషన్ శనివారం సంక్రాతి కానుకగా ప్రేక్షకుల ముందు రాబోతుంది. వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా మరో హీరోయిన్ మెహ్రీన్ కౌర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. తమన్నా, మెహరీన్ లు అక్కాచెల్లెళ్లుగా వెంకటేష్, వరుణ్ తేజ్ లకు భార్యలుగా కనిపిస్తున్నారు.

గ్లామర్ తో రెచ్చిపోయినా

ఇక సినిమాలో పాత్రకి తగ్గట్టు కాకుండా హాట్ హాట్ యాంగిల్స్ లో గ్లామర్ పరంగా తమన్నా రెచ్చిపోయింది. తాజాగా విడుదలైన ఎఫ్ 2 ట్రైలర్ లో తమన్నా హాట్ హాట్ డ్రెస్సులతో చెలరేగిపోయింది. మరో హీరోయిన్ మెహ్రీన్ తో పోటీగా గ్లామర్ గా నటించింది. మరి వెంకీ సరసన తమన్నా లుక్స్ పరంగా ఓకె అన్నప్పటికీ.. కాస్త పిల్ల మాదిరి కనిపించింది. అయితే.. గ్లామర్ పరంగా ఎంతగా రెచ్చిపోయినా తమన్నాకి సీనియర్ హీరోల సినిమాలు తప్ప యంగ్ హీరోల సరసన ఛాన్సులు రావడం కలనే. ఇక ఈ పండక్కి వినయ విధేయ రామకి, కథానాయకుడు సినిమాకి ఎదురెళుతున్న ఎఫ్ 2 కి హిట్ టాకొస్తే ఓకె.. లేదంటే ఆ సినిమాల సునామీలో కొట్టుకుపోవడం ఖాయం. అదే గనక జరిగితే తమన్నా ఇక తట్టాబుట్టా సర్దుకోవడమే అని అంటున్నారు. తమన్నాకి ఈ సినిమా హిట్ ఎంతో అవసరం.

Tags:    

Similar News