టెంప‌ర్ రిలీజ్ ఎందుకు ఆగిందో..?

తమిళ హీరో విశాల్ తెలుగు హిట్ మూవీ ‘టెంపర్స‌ను త‌మిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి ‘అయోగ్య‘ అనే టైటిల్ పెట్టారు. భారీ అంచనాల మధ్య [more]

Update: 2019-05-10 08:07 GMT

తమిళ హీరో విశాల్ తెలుగు హిట్ మూవీ ‘టెంపర్స‌ను త‌మిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. దానికి ‘అయోగ్య‘ అనే టైటిల్ పెట్టారు. భారీ అంచనాల మధ్య నిన్న ఈ చిత్రం అక్కడ రిలీజ్ అవ్వాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని సమాచారం. ఇప్పటికే భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రమోషన్స్ కూడా చేసారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.

త్వ‌ర‌లోనే మ‌రో డేట్‌

కానీ ఏమైందో ఏంటో కానీ రిలీజ్ కాలేదు. మూవీ మేకర్స్ త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. ఈ చిత్రాన్ని మురగదాస్ శిష్యుడు వెంకట్ మోహన్ డైరెక్ట్ చేసాడు. ఇందులో విశాల్ కి జోడిగా రాశీ కన్నా హీరోయిన్ గా నటించగా పార్థిబన్, కేఎస్ రవి కుమార్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. విశాల్ ప్రస్తుతం సుందర్ సి డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు.

Tags:    

Similar News