పోటీలో గెలిచిన హీరో

Update: 2018-12-23 03:53 GMT

ఈ శుక్రవారం తెలుగులో మాత్రమే సినిమాల హడావిడి లేదు. తమిళంలోనూ చాలా సినిమాలు బాక్సాఫీసు వద్ద పోటీ పడ్డాయి. తెలుగులో రెండే రెండు సినిమాలు పడి పడి లేచే మనసు, అంతరిక్షం సినిమాలు విడుదలయ్యాయి. తమిళనాట ఏకంగా తొమ్మిది సినిమాలు ఈ వారం బాక్సాఫీసుని కమ్మేశాయి. అందులో రెండే రెండు సినిమాలు గట్టిగా పోటీ పడ్డాయి. ధనుష్ మారి 2, విజయ్ సేతుపతి సీతా కత్తి సినిమాలు ఒకదానినొకటి నువ్వానేనా అని పోటీకి దిగాయి. అయితే ధనుష్ మారి టు కి యావరేజ్ టాక్ పడగా.. మిగతా ఏడు సినిమాలు ప్లాప్ లిస్ట్ లోకి చేరగా... విజయ్ సేతుపతి సీతా కత్తి మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ ఏడాది 96 సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న విజయ్ సేతుపతి.. మళ్ళీ తాజాగా మూడు నెలలు తిరక్కుండానే సీతా కత్తి సినిమాతో హిట్ కొట్టాడు. సీతా కత్తిలో విజయ్ సేతుపతి... 70 యేళ్లు పైబడిన వృద్ధుడి పాత్రలో గతంలో భారతీయుడు సినిమాలో కమల్ హాన్ లుక్ మాదిరి లుక్ లో ఇరగదీసాడంటున్నారు. ఇంకా ఈ సినిమాకి కథాబలం, అలాగే విజయ్ సేతుపతి నటన అన్ని విజయతీరానికి చేర్చయంటున్నారు. మరి ఎనిమిది సినిమాల పోటీలో విజయ్ సేతుపతి పోటీలో గెలిచిన హీరోగా సంచలనాలు నమోదు చేయడానికి రెడీ అయ్యాడు.

ఇక ఈ లాంగ్ వీకెండ్ తో పాటుగా క్రిష్ట్మస్ సెలవులను విజయ్ సేతుపతి తన సీతా కత్తి తో బాక్సాఫీసుని చెడుగుడాడేయడానికి సిద్దమైపోయాడు. మరి ధనుష్ తో గట్టి పోటీ ఎదుర్కొన విజయ్ సేతుపతి.. ఈ సినిమాతో హిట్ కొట్టి వరుస విజయాలతో.. దర్శకనినిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ హీరోగా మారాడు.

Similar News