‘మహర్షి’ రీమేక్ చేయనున్న తమిళ స్టార్ హీరో

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ సినిమా భారీగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, [more]

Update: 2019-05-03 06:44 GMT

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ సినిమా భారీగా తెరకెక్కించిన విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను దిల్ రాజు, పీవీపీ, అశ్వినిదత్ సంయుక్తంగా నిర్మించారు. మే 9న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహేష్ మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాతో మహేష్ బాబు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ చేరిపోవడం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయడానికి ఓ స్టార్ హీరో ఇంట్రెస్ట్ చూపుతున్నట్టు టాక్ గట్టిగా వినిపిస్తుంది.

మళ్లీ చేయనున్న విజయ్

గతంలో తెలుగులో మహేశ్ బాబు చేసిన ‘పోకిరి’, ‘ఒక్కడు’ సినిమాలు తమిళంలో విజయ్ హీరోగా రీమేక్ చేశారు. అవి ఆయనకు భారీ విజయాలను అందించాయి. అయితే ఇప్పుడు మరోసారి విజయ్ మహేష్ సినిమాను రీమేక్ చేయనున్నాడు. అందుకే ‘మహర్షి’ని రీమేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ‘మహర్షి’ రిలీజ్ తరువాత విజయ్ స్పెషల్ షో వేసుకుని చూడనునట్టు టాక్ వినిపిస్తుంది. అయితే తమిళంలో డైరెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News