డైరెక్టర్ బాల కి అవమానం

తెలుగు లో విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అర్జున్ రెడ్డి సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈసినిమాను హిందీ లో [more]

Update: 2019-02-08 05:37 GMT

తెలుగు లో విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం అర్జున్ రెడ్డి సినిమాను ఇతర భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈసినిమాను హిందీ లో సందీప్ రెడ్డి డైరెక్షన్ లో షాహిద్ క‌పూర్ హీరోగా 'క‌బీర్‌సింగ్‌' పేరుతో తెర‌కెక్కుతోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.

ఇది ఇలా ఉంటె తమిళంలో కూడా ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు. ప్రముఖ నటుడు చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధ్రువ్ హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాల ద‌ర్శ‌క‌త్వంలో వ‌ర్మ అనే పేరుతో సినిమా తెర‌కెక్కుతోంది. అయితే నిన్న ఈసినిమాను విడుదల చేయడం లేదని అధికారంగా ప్రకటించారు.కారణం ఈసినిమా ను ఈ4 ఎంట‌ర్‌టైన్‌మెంట్ నిర్మించ‌డానికి సిద్ధ‌మైంది.

ఈ సంస్థ బి స్టూడియోతో క‌లిసి ఓ ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం ఈ సంస్థ సినిమా అంత సిద్ధం చేసి ఈ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్ వాళ్లకి ఇవ్వాలి. ఫస్ట్ కాపీ చూసిన ఈ 4 ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌తినిధుల‌కు సంతృప్తిగా అనిపించ‌లేదట. అందుకే ఈ సినిమా తమిళ వెర్షన్ ను రీషూట్ చేయాలనీ భావిస్తున్నారు. మరో వెర్షన్ తో జూన్ లో విడుదల చేయాలనీ ఆలోచిస్తున్నారు. కొత్త డైరెక్టర్ తో ఈసినిమా చేయాలనీ నిర్ణయించుకున్నారు

Tags:    

Similar News