ఫైనల్ గా నిజం తెలుసుకుందా?

గత ఏడాది వరకు జై తో ప్రేమాయణం అంటూ కెరీర్ పాడుచేసుకున్న అంజలి బెలూన్ సినిమా తర్వాత జై కి బ్రేకప్ చెప్పి.. ఇప్పుడు కెరీర్ మీద [more]

Update: 2019-11-24 07:02 GMT

గత ఏడాది వరకు జై తో ప్రేమాయణం అంటూ కెరీర్ పాడుచేసుకున్న అంజలి బెలూన్ సినిమా తర్వాత జై కి బ్రేకప్ చెప్పి.. ఇప్పుడు కెరీర్ మీద కాన్సంట్రేట్ చేసింది. జై వలన నిజంగానే అంజలి జీవితం పాడైందా? అంటే నిజమంటున్నాడు బెలూన్ నిర్మాత. బెలూన్ సినిమా టైం లో అంజలి జై మ్యానియా లో ఉండి చెయ్యకూడని పనులు చేసి.. తన కెరీర్ ని సర్వనాశనం చేసుకుందని జై మీద ఆరోపణలు గుప్పించాడు ఆ నిర్మాత. అయితే నిజంగానే అంజలి జీవితాన్ని జై కావాలనే నాశనం చేశాడా.. అయ్యుండొచ్చు. అందుకే అంజలి కెరీర్ నాశనమవుతున్న జై ని వెంటేసుకుని తిరిగింది. ప్రేమ మైకం అలాంటిది. అయితే జై తన కెరీర్ ని గాడి తప్పిస్తున్నాడని అంజలి త్వరగానే కనుక్కున్నట్లుంది…. అందుకే జై ని వదిలించుకుంది.

జై కి బ్రేకప్ చెప్పాక మళ్ళీ గ్లామర్ గా, సన్నగా నాజూగ్గా తయారవడమే కాదు.. అవకాశాల కోసం సోషల్ మీడియానే నమ్ముకుంది. గ్లామరస్ పోజుల్తో… అందాలు ఆరబోస్తూ స్లిమ్ గా తయారై హాట్ హాటు ఫోటో షూట్స్ తో దర్శకనిర్మాతలకు అవకాశాల కోసం హింట్ ఇస్తుంది. మరి ప్రేమ మైకంలో కెరీర్ సర్వనాశనం చేసుకున్న అంజలికి ఫైనల్ గా జై నిజ స్వరూపం తెలిసి.. మళ్ళీ కెరీర్ ని గాడిన పడేసుకునే ప్రయత్నాల్లో ఉంది. ప్రస్తుతం తెలుగు తమిళంలో తెరకెక్కుతున్న నిశ్శబ్దం లో అంజలి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది

Tags:    

Similar News