తమన్నా కు విజయ్ గురించి తెలియదు అంట

మిల్క్ బ్యూటీ తమన్నా నటించిన ‘పెట్రోమాక్స్’ చిత్రం రిలీజ్ అయింది. అయితే ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా..తమిళ నటుడు విజయ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ [more]

Update: 2019-10-13 07:28 GMT

మిల్క్ బ్యూటీ తమన్నా నటించిన ‘పెట్రోమాక్స్’ చిత్రం రిలీజ్ అయింది. అయితే ఈమూవీ ప్రమోషన్స్ లో భాగంగా తమన్నా..తమిళ నటుడు విజయ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది. హీరో విజయ్ గురించి మీ స్పందన ఏంటీ అంటూ తమన్నా ను మీడియా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. దీని సమాధానంగా తమన్నా ఇలా చెప్పింది…

” ఆయన గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. ఆయనతో నేను ఒక్క సినిమానే నటించాను. నాకు ఆయనకు మధ్య ఎక్కువ కమ్యూనికేషన్ జరగలేదు. షూటింగ్ కి వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉండేది. అసలు ఏమి తెలియని ఆయన గురించి ఏం మాట్లాడగలను.. ఆయన గురించి ఏమీ తెలియకుండా ఎలా కామెంట్ చేయగలను” అంది.

ఈ మాటలకు విజయ్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. విజయ్ ను ఫ్యాన్స్ ఎలా కొలుస్తారో అందరికి తెలిసిందే. ఆయనను దేవుడిలా కొలిచే ఫ్యాన్స్ ఫీలింగ్ ను తమన్నా హర్ట్ చేసింది. ఆయన గురించి తెలియదని తమన్నా చేసిన వ్యాఖ్యలకు వారు సీరియస్ అవుతున్నారు. సూపర్ స్టార్ అయినా విజయ్ గురించి తెలియకపోవడం ఏంటి అంటూ ఆమెపై సీరియస్ అవుతున్నారు.

Tags:    

Similar News