ఆ పాత్రలో మొదటిసారి తమన్నా..!

కెరీర్ పరంగా నటి తమన్నా స్లోగా ఉంది. అవకాశాలు తక్కువ అవ్వడంతో ఇంకా తమన్నాకు సినిమాలు రావేమోనని అనుకున్నారు. కానీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ వరుస సినిమా [more]

Update: 2019-03-20 08:11 GMT

కెరీర్ పరంగా నటి తమన్నా స్లోగా ఉంది. అవకాశాలు తక్కువ అవ్వడంతో ఇంకా తమన్నాకు సినిమాలు రావేమోనని అనుకున్నారు. కానీ అందరినీ సర్ప్రైజ్ చేస్తూ వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది తమన్నా. ఈ ఏడాది స్టార్టింగ్ లో వచ్చిన ఎఫ్ 2 చిత్రం బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్న తమన్నా ప్రస్తుతం ‘దేవీ-2’, ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమాలలో నటిస్తోంది. అలానే సైరాలో ఒక కీలక పాత్ర చేస్తోంది. ఇవి కాకుండా విశాల్ సినిమాలో చేసే ఛాన్స్ కొట్టేసింది. తమన్నా ఈ సినిమాలో చేసేది అటువంటి ఇటువంటి పాత్ర కాదు.

విలన్ పాత్రలో…

ఇందులో విలన్ పాత్రలో నటిస్తోందని సమాచారం. విశాల్ తో మైండ్ గేమ్ ఆడే పాత్రలో నటిస్తుందట. తమన్నా ఇప్పటివరకు ఇటువంటి పాత్రలో నటించలేదు. ఇదే మొదటిసారి. విశాల్ సినిమాలో తమన్నా విలన్ గా చేయడానికి ఒక కారణం ఉంది. విశాల్ సినిమాల్లో లేడీ విలన్ పాత్రలు సూపర్ హిట్ అయ్యాయి. ‘పొగరు’లో శ్రియా రెడ్డి, ‘పందెంకోడి 2’లో వరలక్ష్మి, డిటెక్టివ్ చిత్రంలో ఆండ్రియా పాత్రలు ఎంత హైలైట్ అయ్యాయో ఈ చిత్రంలో తన పాత్ర కూడా అంతే అవుతుందని భావిస్తుంది. అందుకే వెంటనే ఓకే చేసిందని టాక్. విశాల్ తో తమన్నాకు ఇది మూడు సినిమా.

Tags:    

Similar News