ఐటమ్స్ తోనే భారీగా దండుకుంటోంది..!

Update: 2018-08-07 07:00 GMT

ప్రస్తుతం మిల్కి బ్యూటీ తమన్నా పనైపోయిందనే వాళ్లకి చెంప పెట్టుగా తమన్నా అటు హీరోయిన్ గా.. ఇటు ఐటెం గర్ల్ గా అదరగొట్టేస్తుంది. బాహుబలి తర్వాత బావురుమన్నా మెల్లిగా తేరుకుని మళ్ళీ ఫామ్ లోకొచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది. హీరోయిన్ అవకాశానికైనా, ఐటెం గర్ల్స్ కైనా సై అంటుంది. ఇప్పటికే ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెలుగు క్వీన్ షూటింగ్ పూర్తి చేసిన తమన్నా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ సరసన ఫన్ అండ్ ప్రష్టేషన్ ఎఫ్ 2లో నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ మీదుంది. అయితే హీరోయిన్ గానే కాకుండా తమన్నా అవకాశమొస్తే ఐటెం గర్ల్ గా కూడా అదరగొడుతూనే ఉంది.

ఒక్క ఐటెంకు కోటి..?

బెల్లంకొండ శ్రీనివాస్ రెండు సినిమాల్లో ఐటెంతో ఇరగ్గొట్టిన తమన్నా.. ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమాలో స్వింగ్ జరా స్వింగ్ జరా అంటూ హాట్ హాట్ పర్ఫార్మెన్స్ కి అందరూ పడిపోయారు. మరి హీరోయిన్ అంటే సినిమా విడుదలయ్యే వరకు ఆ టీమ్ తో ప్రయాణించాలి. కానీ ఐటెం గర్ల్ అంటే ఐటెం సాంగ్ కంప్లీట్ కాగానే పారితోషకం తీసుకుని సడైపోయి తన పని తాను చేసుకోవచ్చు. అయితే హీరోయిన్ గా తీసుకునే పారితోషకం ఒక్క ఐటెంకె వచ్చేస్తుంది. అందులోను ఓ అన్నంత హీరోయిన్ అవకాశాలు రావడం లేదు కూడా. ఇలాంటి టైం లోనే తమ్మన్న మరో క్రేజీ ప్రాజెక్ట్ లో దాదాపుగా కోటి పారితోషకానికి ఐటెంకి సై అందట.

యశ్ సినిమాలో చిందేయనున్న తమన్నా

జాగ్వార్ ఫేం నిఖిల్ గౌడ‌కు అత్యంత స‌న్నిహితుడు... హీరో య‌శ్ నటించబోయే తెలుగు, తమిళం, మ‌ల‌యాళం, హిందీలోనూ తెరకెక్కబోతున్న క్రేజీ భారీ బడ్జెట్ సినిమాలో తమన్నా కోటి పారితోషకానికి ఐటెం సాంగ్ చేసే అవకాశం అందుకుంది. మరి ఒక పక్క పారితోషకం... మరోపక్క నాలుగు భాషల్లోనూ సినిమా విడుదలవడంతో తనకు కూడా క్రేజ్ వస్తుందనే ఉద్దేశ్యంతోనే ఈ కొత్త హీరో పక్కన ఐటెం లో చిందేయ్యడానికి తమ్ము బేబి ఒప్పుకుందట. మరి తమన్నా జాగ్వార్ సినిమాలోనూ నిఖిల్ తో ఆడిపాడిన విషయం తెలిసిందే.

Similar News