ఖాళీగా ఉండి ఐటెం చెయ్యలేదంటున్న తమన్నా

చాలామంది హీరోయిన్స్ కి చేతిలో సినిమాలు లేకపోతె ఐటెం సాంగ్స్ చెయ్యడానికి రెడీ అవుతారనేది పాత ముచ్చటే. కానీ కొంతమంది ఫామ్ లో ఉన్నపుడు కూడా స్పెషల్ [more]

Update: 2020-01-01 07:38 GMT

చాలామంది హీరోయిన్స్ కి చేతిలో సినిమాలు లేకపోతె ఐటెం సాంగ్స్ చెయ్యడానికి రెడీ అవుతారనేది పాత ముచ్చటే. కానీ కొంతమంది ఫామ్ లో ఉన్నపుడు కూడా స్పెషల్ సాంగ్స్ లో కనబడతారు. కాజల్ అగర్వాల్, శృతి హాసన్ లాంటోళ్ళు.. సినిమాల్తో టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ.. హీరోల మీదున్న ఇంట్రెస్ట్ తో వారి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే బాహుబలి తర్వాత అవకాశాలు తగ్గుమొహం పట్టిన తమన్నా ఖాళీగా ఉండి సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఐటెం సాంగ్ చేసిందని ఎవరో కామెంట్ చేశారట. దానికి తమన్నా కూడా ఘాటైన రిప్లై ఇచ్చింది.

గత ఏడాది సై రా, ఎఫ్ 2 లాంటి బిగ్ ప్రాజెక్టులతో అదరగొట్టిన తమన్నా చేతిలో బోలెడన్ని ఆఫర్స్ ఉన్నాయని చెప్పడమే కాదు.. తనకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఐటమ్ సాంగ్ చెయ్యాలి అని అడిగితే కాదనలేకపోయా అని.. అంతే కానీ ఖాళీగా ఉండి మహేష్ కోసం సరిలేరు లో ఐటెం సాంగ్ చెయ్యలేదు నేను ప్రస్తుతం బోలెడన్ని సినిమాల్తో ఫుల్ బిజీ అని చెబుతుంది. ఏడాదిలో 365 రోజులు పని చేస్తూనే ఉంటానని, కాల్షీట్స్ లో ఖాళీ దొరికినప్పుడల్లా ఇతర భాషల సినిమాలు చేస్తున్నా అంటూ ఘంటాపధంగా చెప్పుకొస్తుంది తమన్నా.

Tags:    

Similar News