ఐటెం కాదా.. అథిదిగానా?

మహేష్, తమన్నా కలిసి ఆగడు సినిమాలో నటించారు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి కి మాత్రం తమన్నా హిట్ హీరోయిన్. ఎఫ్ 2 లో వెంకీ సరసన [more]

Update: 2019-12-01 12:40 GMT

మహేష్, తమన్నా కలిసి ఆగడు సినిమాలో నటించారు. అయితే దర్శకుడు అనిల్ రావిపూడి కి మాత్రం తమన్నా హిట్ హీరోయిన్. ఎఫ్ 2 లో వెంకీ సరసన తమన్నా నటించడడం, ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. మహేష్ – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ కోసం అడగడం తమన్నా ఒప్పేసుకోవడం జరిగిపోయింది. తమన్నా కూడా సరిలేరు నీకెవ్వరూ సినిమాలో నటించబోతున్నట్లుగా కన్ఫర్మ్ చేసింది. ఇక తాజాగా మండే మండే సరిలేరు నీకెవ్వరూ సాంగ్స్ సందడి చేస్తాయని చెప్పడంతో.. అందులో తమన్నా – మహేష్ ల ఐటెం సాంగ్ కూడా ఉంటుందని.. ఐటెం స్పెషలిస్ట్ దేవిశ్రీ ఎలాంటి మ్యూజిక్ ఇచ్చాడో అనే ఇంట్రెస్ట్ మహేష్ ఫ్యాన్స్ లో పెరిగింది.

తాజాగా తమన్నా ఐటెం సాంగ్ సంగతేమో గాని.. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఓ అతిధి పాత్ర వెయ్యబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. మరి తమన్నా లక్కీ గనక తన సినిమాలో ఓ పాత్ర చేస్తే అది వర్కౌట్ అవుతుంది అని అనిల్ రావిపూడి భావించి తమన్నా కి గెస్ట్ రోల్ ఇచ్చినట్లుగా ప్రచారం మొదలైంది. మరి ఐటెం లో తమన్నా ఉందా?లేదా? అనేది ప్రస్తుతం కాస్త కన్ఫ్యూషన్ అయినా… తమన్నా మాత్రము సరిలేరు నీకెవ్వరూ లో ఉన్నది మాత్రం నిజమని, త్వరలోనే మహేష్ సినిమా కోసం తమన్నా సరిలేరు సెట్స్ కి రాబోతుందని చెబుతున్నారు.

Tags:    

Similar News