కెరీర్ తొలినాళ్ళకన్నా.. ఇప్పుడే బెస్ట్ అంటుంది

సై రా నరసింహరెడ్డి సినిమాలో లక్ష్మీగా ఓ మంచి పాత్ర చేసిన తమన్నాకి సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఐటెం లో ఆడే అవకాశం వచ్చింది. అయితే తమన్నాకి [more]

Update: 2020-01-17 07:37 GMT

సై రా నరసింహరెడ్డి సినిమాలో లక్ష్మీగా ఓ మంచి పాత్ర చేసిన తమన్నాకి సరిలేరు నీకెవ్వరూ సినిమాలో ఐటెం లో ఆడే అవకాశం వచ్చింది. అయితే తమన్నాకి కెరీర్ తొలినాళ్ళకన్నా ఇప్పుడే మంచి బలమైన పాత్రలు వస్తున్నాయని తెగ సంతోషపడుతుంది. సినిమాల్లోకి స్టార్ట్ అయ్యి పదమూడేళ్ళ గడుస్తున్నప్పటికీ.. గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గని తమన్నా కెరీర్ తొలినాళ్లలో.. కమర్షియల్ గా ఆడిపాడే పాత్రలకే పరిమితం అయ్యా అని. అలానే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశా అని.. కానీ కెరీర్ లో ఇప్పటికి నాకు బలమైన పాత్రలు రావడం సంతోషకరమైనది అని చెబుతుంది. కెరీర్ మొదట్లో పాత్రల పరిధి, దానికున్న ప్రాధాన్యత గురించి పెద్దగా ఆలోచించించ లేదని చెబుతున్న తమన్నాఇన్నాళ్లుగా తనకు సినిమాల్లో అవకాశాలు రావడం మాత్రం మాత్రం నేను సాధించిన గొప్ప లక్ష్యంగా అనుకుంటున్నా అంటుంది.

ఇక ఇప్పుడు తనకి దర్శకులు బలమైన పాత్రలు రాస్తున్నారని.. ఇప్పుడు స్క్రీన్ నిండుగా నటించడానికి స్కోప్ ఉన్న పాత్రలు దక్కుతున్నాయని చెబుతున్న తమన్నా.. సినిమాల్లో అయినా, ఏ రంగంలో అయినా మనం అనుకున్న మార్పు వెంటనే జరగదని.. దానికి చాలా టైం పడుతుంది అని అంటుంది. మరి ఇప్పటికి గ్లామర్ డ్రెస్సులతో కొత్త హీరోయిన్స్ కి సవాల్ విసురుతున్న తమన్నాకి గ్లామర్ ఆరబొయ్యడానికి పెద్దగా హద్దులేమి పెట్టుకోదు. అలాగే ఇవే పాత్రలు చెయ్యాలని రూల్స్ పాటించదు. కాబట్టే ఇప్పటికీ బిజీ తారాగానే ఉంటుంది.

Tags:    

Similar News