అలాంటి పాత్ర కావాలంటున్న తమన్నా?

బాహుబలి తర్వాత కాస్త డల్ అయిన తమన్నా ప్రస్తుతం సై ర నరసింహారెడ్డి లో లక్ష్మి పాత్ర తోనూ, సరిలేరు నీకెవ్వరూ సినిమాలో డాంగ్ డాంగ్ ఐటెం [more]

Update: 2020-01-25 06:50 GMT

బాహుబలి తర్వాత కాస్త డల్ అయిన తమన్నా ప్రస్తుతం సై ర నరసింహారెడ్డి లో లక్ష్మి పాత్ర తోనూ, సరిలేరు నీకెవ్వరూ సినిమాలో డాంగ్ డాంగ్ ఐటెం సాంగ్ తోనూ ఫుల్ హ్యాపీ గా ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ. తమన్నా ఇప్పటికి బిజీ తారే. తాజాగా ఓ జనరల్ ఈవెంట్ లో పాల్గొన్న తమన్నా కి సినిమాలంటే ఎంతిష్టమో చెప్పింది. బాహుబలి సినిమాతో ప్రపంచంలోని అందరికి పరిచయం అయ్యా అని.. ఆతర్వాత ఎన్నో మార్పులొచ్చాయని ఇక బాహుబలి తర్వాత కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా చెబుతుంది తమన్నా. మరి బాహుబలిలో తనకి ప్రాధాన్యత ఇవ్వలేదని తమన్నా బాగా గుర్తించినట్టుగా అనిపిస్తుంది. అందుకే కథల ఎంపికలో జాగ్రత్తలు అంటుంది.

ఇక తనకి పూర్తిస్థాయి నృత్యం తో కూడిన సినిమా చెయ్యాలని ఉందని.. ఆ కోరిక త్వరలోనే నెరవేరుతుందేమో చూద్దామంటుంది. ప్రస్తుతం గోపీచంద్ – సంపత్ నంది సినిమాలో కబడ్డీ ప్లేయర్ గా కొత్త తరహా పాత్ర చేస్తున్నట్టుగా చెప్పిన తమన్నా.. ప్లాప్ వస్తే కుంగిపోయి.. హిట్ వస్తే పండగ చేసుకోకూడదని.. ప్లాప్, హిట్ లను బేరీజు వేసుకుంటే కెరీర్ సాఫీగా సాగుతుంది అని చెబుతుంది.

Tags:    

Similar News