సైరాలో తమన్నా విలనా..?

చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చేస్తున్నాడు. గత రెండేళ్లుగా నిర్విరామంగా షూటింగ్ [more]

Update: 2019-05-08 07:43 GMT

చిరంజీవి ఖైదీ నెంబర్ 150 తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని చేస్తున్నాడు. గత రెండేళ్లుగా నిర్విరామంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇండియా వైడ్ గా భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో చిరు ఉయ్యాలవాడగా అదరగోట్ట‌నున్నాడు. ఇప్పటికే విడుదలైన సైరా చిరు లుక్ అందరినీ ఆకట్టుకుంది. ఇక చిరుకి జోడీగా నయనతార నటిస్తున్నఈ సినిమాలో మరో హీరోయిన్ తమన్నా కూడా ఓ కీలక పాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో నయనతార.. చిరు అంటే ఉయ్యాలవాడ భార్య పాత్రలో కనిపిస్తుంది అనేది అప్పుడెప్పుడో లీకైన సైరా స్టిల్స్ లో చూసాం. అయితే తమన్నా రోల్ పై ఎలాంటి క్లూ కానీ క్లారిటీ కానీ లేదు.

రాణిగా… విల‌న్ గా…

తాజాగా సైరాలో తమన్నా పోషిస్తున్న పాత్రపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమన్నా సైరాలో ఓ రాణిగా నటిస్తోందని, పైగా తమన్నా పోషిస్తోన్న పాత్రకు కాస్త నెగిటివ్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. మరి తమన్నా పుట్టినరోజుకి సైరా బృందం వదిలిన లుక్ లో తమన్నా చాలా పద్దతిగా సాంప్రదాయ వస్త్రధారణలో కనిపించింది. ఇప్పుడు చూస్తుంటే తమన్నా పాత్రకి నెగెటివ్ షేడ్స్ ఉంటాయంటున్నారు. మరి తమన్నా సైరాలో విలన్ గా ఎలాంటి అరాచకాలు చేస్తుంది అనేది తెలియాలంటే సైరా విడుదల వరకు వెయిట్ చెయ్యక తప్పదు.

Tags:    

Similar News