జయప్రదగా మిల్కి బ్యూటీ..!

Update: 2018-10-11 06:28 GMT

ఎన్టీఆర్ బయోపిక్ జోరు మాములుగా లేదు. కథానాయకుడు, మహానాయకుడుగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ లో చేస్తున్న నటుల గురించి చాలా కేర్ తీసుకుంటున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ గా బాలకృష్ణని అద్భుతంగా చూపెట్టిన క్రిష్ ఏఎన్నార్ కోసం సుమంత్ ని దించేసాడు. ఇక చంద్రబాబు నాయుడుగా రానా ని పర్ఫెక్ట్ గా చూపెట్టేడు. ఎన్టీఆర్ తో అనుబంధం ఉన్న పాత్రల డిజైన్స్ విషయంలో చాలా శ్రద్ద వహిస్తున్నాడు క్రిష్. కాకపోతే ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో ఆడిపాడిన శ్రీదేవిగా రకుల్ లుక్ విషయంలో కాస్త విమర్శలొచ్చాయి.

రాశి ఖన్నా నటిస్తుందని అనుకున్నా...

ఇక తాజాగా శ్రీదేవి లుక్ బయటికి రాగా.. ఇప్పుడు ఎన్టీఆర్ తో పలు సినిమాల్లో హిట్ పెయిర్ అనిపించుకున్న జయప్రదగా... క్రిష్ మరో టాలీవుడ్ హీరోయిన్ ని సెట్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎన్టీఆర్ నట జీవితంలో శ్రీదేవి, జయప్రద, జయసుధలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. మరి శ్రీదేవి పాత్రకి రకుల్ ను తీసుకోవడం... ఆమెపై ఒక పాటను చిత్రీకరించడం జరిగిపోయింది. ఇక మరో ముఖ్యమైన జయప్రద పాత్ర కోసం రాశి ఖన్నాను సంప్రదించినట్టుగా గతంలో వార్తలు వచ్చాయి.

ఐదు నిమిషాల పాటు...

కానీ తాజాగా జయప్రద పాత్ర కోసం మిల్కి బ్యూటీ తమన్నాను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో జయప్రద పాత్ర ఓ ఐదు నిమిషాల పాటు ఉంటుందని అంటున్నారు. ఇక ఈ ఐదు నిమిషాల జయప్రద పాత్రను చేయడానికి తమన్నా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. తమన్నా ఎన్టీఆర్ బయోపిక్ లో జయప్రద పాత్రకి ఒప్పుకోవడం... ఇందుకోసం 3 రోజుల పాటు డేట్లు కూడా ఇచ్చేసిందనే టాక్ ఫిలింసర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

Similar News