‘దటీజ్ మహాలక్ష్మి’ అంటున్న తమన్నా

Update: 2018-06-06 05:38 GMT

2014 మార్చిలో బాలీవుడ్ లో రిలీజ్ అయిన 'క్వీన్' అక్కడ బ్లాక్ బస్టర్ అయింది. కంగనా రనౌత్ నటించిన ఈ సినిమాను సౌత్ లో కొన్ని భాషల్లో రీమేక్ చేస్తున్నారు. తెలుగుతో పాటు...కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో రీమేక్ చేస్తున్నారు. అన్ని భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రంకి తెలుగులో మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుంది.

ఫిమేల్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ‘దటీజ్ మహాలక్ష్మి’ టైటిల్ ను ఖరారు చేశారు. గతంలో రిలీజ్ అయిన ‘100% లవ్ చిత్రం’లో తమన్నా పాత్ర మహాలక్ష్మి పాత్రలో తాను నటించిన విషయాన్ని గుర్తు చేసుకుని ఈ టైటిల్ ని అధికారంగా వెల్లడించింది. మళ్లీ అదే పేరును ఈ చిత్రానికి పెట్టడం తనకు చాలా ఆనందంగా ఉందని చెప్పింది.

తెలుగు సంగతి ఇలా ఉంటె .. తమిళంలో లీడ్ రోల్ లో కాజల్..మలయాళంలో మాంజిమా మోహన్.. కన్నడలో పరుల్ యాదవ్ లు టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు. పరుల్ యాదవ్ బర్త్ డే సందర్భంగా సెట్స్ లో కేక్ కట్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది పరుల్. ఆమె మాట్లాడుతూ..ఈ బర్త్ డే తనకెంతో ప్రత్యేకమని, ఈ చిత్రంలో పని చెయ్యడం మర్చిపోలేని అనుభూతిగా వుందని చెప్పింది. ఇక తమన్నాతో పాటు కాజల్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Similar News