కావాలనే అవకాశం కాలదన్నుకుందా?

బాహుబలి తర్వాత మల్లి హిట్టుకొట్టలేకపోయిన తమన్న ఏదో చిన్నా చితక సినిమాలు ట్రై చేస్తూనే ఉంది. తెలుగు, తమిళంతో పాటుగా మధ్యలో బాలీవుడ్ కి వెళ్లొచ్చిన అమ్మడు [more]

Update: 2019-06-29 16:13 GMT

బాహుబలి తర్వాత మల్లి హిట్టుకొట్టలేకపోయిన తమన్న ఏదో చిన్నా చితక సినిమాలు ట్రై చేస్తూనే ఉంది. తెలుగు, తమిళంతో పాటుగా మధ్యలో బాలీవుడ్ కి వెళ్లొచ్చిన అమ్మడు మాత్రం హిట్ కొట్టలేకపోతుంది. ప్రస్తుతం తమ్మన్న క్రేజ్ టాలీవుడ్ లో సున్నా. అయినా ఒకటో అరా అవకాశాలు తమన్నా కి తగులుతూనే ఉన్నాయి. అభినేత్రి, దేవి 2 వంటి హర్రర్ సినిమాల్లో నటించిన తమన్నా ఇప్పుడు రాజుగారి గది 3 లో కూడా మెయిన్ లీడ్ లో నటించడానికి ఒప్పుకోవడమే కాదు.. ఆ సినిమా ఓపెనింగ్ పూజలో కూడా పాల్గొని సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. రాజావుగారి గది ని ఎలాంటి స్టార్ కాస్ట్ లేకుండా తీసిన ఓంకార్ రాజుగారి గది 2 కోసం నాగ్, సమంత లను నమ్ముకున్నాడు. తాజాగా రాజుగారి గది 3 కోసం తమన్నాని ఎంపిక చేసుకున్నాడు.

కానీ తమన్నా ఓం కార్ రాజుగారిగది 3 టీం కి హ్యాండ్ ఇచ్చినట్లుగా వార్తలొస్తున్నాయి తన దగ్గరకొచ్చిన మంచి అవకాశాన్ని తమన్నా కలదన్నుకున్నట్లుగా చెబుతున్నారు. అది కూడా తనకి ఏమాత్రం అచ్చిరాని బాలీవుడ్ కోసమట. తమన్నా బాలీవుడ్ లో వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్న…. అక్కడ తమన్నా సక్సెస్ కాలేకపోయినా తమన్నా కన్ను మాత్రం బాలీవడ్ మీదే ఉంటుంది. బాలీవుడ్ లో నవజుద్దీన్ సిద్ధిఖి హీరోగా రానున్న ఓ సినిమాలో నటించేందుకు తమన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ సినిమాతో రాజుగారి గది 3 కాల్షీట్లకు క్లాష్ వస్తుండంతో తమన్నా తెలుగు రాజుగారి గది నుండి చల్లగా జారుకుందనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

Tags:    

Similar News