తమన్నా హ్యాండ్ ఇచ్చిందా?

బ్లఫ్ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలతో హీరోగా అదరగట్టేసిన సత్య దేవ్.. తాజాగా టాప్ హీరోయిన్ తమన్నా తో గుర్తుందా శీతాకాలం సినిమా మొదలు [more]

Update: 2020-10-30 09:27 GMT

బ్లఫ్ మాస్టర్, ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమాలతో హీరోగా అదరగట్టేసిన సత్య దేవ్.. తాజాగా టాప్ హీరోయిన్ తమన్నా తో గుర్తుందా శీతాకాలం సినిమా మొదలు పెట్టాడు. కన్నడ లో హిట్ అయినా లవ్ మాక్ టైల్ సినిమాని తెలుగులో గుర్తుందా శీతాకాలం గా రీమేక్ చేస్తున్నారు. అయితే ఎప్పుడో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ అంటే సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. అయితే సినిమా షూటింగ్ ఇక మొదలు కాకపోవడంతో.. గుర్తుందా శీతాకాలం సినిమా ఆగిపోయింది అనే టాక్ మొదలైంది. తమన్నాకి కరోనా పాజిటివ్ వచ్చి 15 డేస్ ఇంట్లోనే ఉండి మల్లి షూటింగ్స్ కోసం వచ్చింది.

అయితే ఇప్పుడు గుర్తుందా సీతాకాలం సినిమాకి తమన్నా హ్యాండ్ ఇచ్చింది అనే టాక్ తో పాటుగా. సత్య దేవ్ కూడా ఈ సినిమాకి డేట్స్ కేటాయించలేకపోతున్నాడని, అలాగే బడ్జెట్ వలన ఈ సినిమా ఇక పట్టాలెక్కే ఛాన్స్ లేదని ఇలా ప్రచారం స్టార్ట్ అయ్యింది. మరి తమన్నా హ్యాండ్ ఇచ్చిందా? బడ్జెట్ ప్రోబ్లేమా? లేదంటే సత్య దేవ్ డేట్స్ ప్రోబ్లేమా? అనేది తెలియదు కానీ.. సత్యదేవ్ మాత్రం ఈ సినిమా ఆగిపోలేదు.. గుర్తుందా శీతాకాలం సినిమాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది అని అంటున్నాడు.

Tags:    

Similar News