తమన్నా.. మెహ్రీన్ లు అక్కచెల్లెళ్ళా?

Update: 2018-06-20 03:03 GMT

పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్ సినిమాల్లో కామెడీకి పెద్ద పీట వేసి సూపర్ హిట్స్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి వెంకటేష్, వరుణ్ తేజ్ లతో కామెడీ పండిస్తానంటున్నాడు. సినిమాలో హీరో కి హీరోయిజం తోపాటు కామెడీ ని కూడా మిక్స్ చేసి హీరోలతో కామెడీ డైలాగ్స్ చెప్పించగల సత్తా ఉన్న దర్శకుడు అనిల్ రావిపూడి. అనిల్ రావిపూడి ఇపుడు వెంకీ, వరుణ్ తేజ్ లతో ఎఫ్ 2 అనే మల్టీస్టారర్ ని మొదలు పెట్టాడు. సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి ఎఫ్ 2 సినిమాని మల్టీస్టారర్ గా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాతో నాలుగో హిట్ కూడా కోట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.

అయితే మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ రోల్స్ ఎలా వుండబోతున్నాయనే ఆసక్తి అందరిలో ఉంది. మరి సీనియర్ హీరో వెంకటేష్ కుర్ర హీరో వరుణ్ కి మధ్యన ఎలాంటి రిలేషన్ ఉంటుంది... అనే క్యూరియాసిటిలో ప్రేక్షకులు ఉన్నారు. గతంలో వెంకటేష్ సీనియర్ హీరో అయినప్పటికీ.. మహేష్ బాబు కి అన్నగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో నటించి మెప్పించాడు. మరి ఈ సినిమాలో వెంకీ అండ్ వరుణ్ ఎలా కనబడబోతున్నారనే హాట్ టాపిక్ కి ఇప్పుడు తెరపడిండదనే చెప్పాలి. ఈ సినిమాలో వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ లు తోడల్లుళ్లుగా కనబడబోతున్నారనే టాక్ వినబడుతుంది.

కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఒక పెద్ద కుటుంబంలో వెంకీ మరియు వరుణ్ తేజ్ లు తోడల్లుళ్లుగా నటిస్తున్నారని అంటున్నారు. వీరిద్దరూ తోడల్లుళ్లు అంటే... హీరోయిన్స్ ఇద్దరూ అక్క చెల్లెళ్లుగా నటిస్తారన్నమాటేగా... ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నా అనిల్ రావిపూడి.. స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసాడంటున్నారు. వచ్చే శనివారం అంటే జూన్ 23 నే ఈ సినిమాకి పూజ కార్యక్రమాలు నిర్వహించి రెగ్యులర్ షూటింగ్ మొదలెట్టేయ్యాలనే ప్లాన్ లో ఇద్దరు హీరోలు, దర్శకుడు అండ్ నిర్మాత దిల్ రాజు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ సినిమాలో యాంకర్ అనసూయ ఒక కీ రోల్ ప్లే చేస్తుండగా... తమన్నా వెంకటేష్ సరసన, వరుణ్ సరసన మెహరీన్ నటిస్తున్నారు.

Similar News