తమన్నాకి కాలింది?

ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన తమన్నాకి ఇప్పుడు ఓ అన్నంత అవకాశాలు రావడం లేదు. గత ఏడాది ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయినా [more]

Update: 2020-04-09 06:02 GMT

ఒకప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన తమన్నాకి ఇప్పుడు ఓ అన్నంత అవకాశాలు రావడం లేదు. గత ఏడాది ఎఫ్ 2 బ్లాక్ బస్టర్ హిట్ అయినా తమన్నాకి అవకాశాలు పెద్దగా తలుపుట్టలేదు. అయితే తమన్నా ప్రస్తుతం సీటిమార్ సినిమా లో గోపీచంద్ తో కలిసి నటిస్తుంది. ఆ సినిమా కోసం కబడ్డీ కూడా నేర్చుకున్న తమన్నా కి చేతిలో సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది అంటూ ప్రచారం జరగడంతో తమన్నాకి బాగా కాలినట్టుగా ఉంది.

అందుకే నేను 365 రోజులు బిజీనే. ఎప్పుడు ఏదో ఒక సినిమా షూటింగ్స్ తో నేను బిజీగానే ఉంటాను. వరసగా సినిమాలు చేస్తూ కొత్త ప్రాజెక్టులను ఒప్పుకుంటున్నాను. అయితే వచ్చిన అవకాశాలను వచ్చినట్టుగా ఒప్పుకోకుండా నచ్చిన పాత్రలకే ఓకె చెబుతున్నాను. నా ప్లానింగ్ ప్రకారమే నేను సినిమాలు చేస్తున్నా… నేను ఖాళీగా ఉన్నానని ప్రచారం చేసే వారే ఖాళీగా ఉండి ఉంటారంటూ.. తనపై రూమర్స్ సృస్తిస్తున్న వారిపై ఫైర్ అవుతుంది.

Tags:    

Similar News