నిన్ను చూసి అంటే.. నిన్ను చూసి అంటున్నారు!!

హీరోయిన్ తమన్నా సినిమాల్లోకి అడుగుపెట్టి… నిన్నటికి 15  ఏళ్ళు పూర్తయిన సందర్భంగా టాప్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ సమంత తమన్నా ని విష్ చేస్తూ చేసిన ట్వీట్ [more]

Update: 2020-03-05 12:28 GMT

హీరోయిన్ తమన్నా సినిమాల్లోకి అడుగుపెట్టి… నిన్నటికి 15 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా టాప్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ సమంత తమన్నా ని విష్ చేస్తూ చేసిన ట్వీట్ వైరల్ అయ్యింది. తమన్నా మంచు హీరో తో శ్రీ అనే సినిమాతో సినిమాల్లోకి అడుగుపెటింది. ఇక సమంత తమన్నా ని ఉద్దేశించి.. టాలీవుడ్ కి అందమైన, కష్టపడే మనస్తత్వం, నిజాయితీ ఉన్న తమన్నా ఓ టపాకాయ్ లాంటి అమ్మాయి. అలాంటి తమన్నా 15 అద్భుతమైన సంత్సరాలు పూర్తి చేసున్నందుకు కంగ్రాట్స్ డార్లింగ్ అంటూ సమంత చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఓ టాప్ హీరోయిన్ మరో హీరోయిన్ ని ఇలా పొగుడుతూ ట్వీట్ చెయ్యడం నిజంగానే అద్భుతం.

ఇక సమంత అలా ట్వీట్ చేసిందో లేదో.. తమన్నా ఇలా రిప్లయ్ ఇచ్చేసింది. సమంత నిన్ను చూసి చాలా నేర్చుకున్నా, ఎలాంటి పని చేసినా.. అది నీ స్ఫూర్తి తోనే, నువ్వు ఎంచుకునే పాత్రలు, నీ నటనతోనే.. నేను కూడా పాత్రలను ఎంపిక చేసుకుంటూ.. ఆ పాత్రలు పోషించడంలో నువ్వే నా స్ఫూర్తి అంటూ ట్వీట్ చేసింది. మరి సమంత నువ్వే నా స్ఫూర్తి అంటే… తమన్నా కూడా నువ్వే నా స్ఫూర్తి అంటూ ట్వీట్స్ చేసుకోవడం నెటిజెన్స్ ని విశేషంగా ఆకర్షించింది.

Tags:    

Similar News