భళ్లాల దేవుడికి ‘నో’ చెప్పిన మహానటి

బాహుబలి భళ్లాల దేవుడు రానా అమెరికాలో తన కంటికి శస్త్ర చికిత్స చేయించుకుని.. ప్రస్తుతం ఇండియాకి తిరిగొచ్చాడు. రానా తాజాగా సాయి పల్లవితో విరాట పర్వం సినిమాలో [more]

Update: 2019-09-18 06:55 GMT

బాహుబలి భళ్లాల దేవుడు రానా అమెరికాలో తన కంటికి శస్త్ర చికిత్స చేయించుకుని.. ప్రస్తుతం ఇండియాకి తిరిగొచ్చాడు. రానా తాజాగా సాయి పల్లవితో విరాట పర్వం సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్తో బాగా బిజీ అయిన రానా.. ఇప్పుడు మరో కొరియన్ సినిమా రీమేక్ చేయబోతున్నాడట. ఓ కొరియన్ సినిమా హక్కులు కొన్న రానా ఆ సినిమాని దర్శకురాలు నందిని రెడ్డి చేతిలో పెట్టాడట. ప్రస్తుతం ఆ సినిమా మీద వర్క్ చేస్తున్న నందిని రెడ్డి, రానా కోసం ఓ హీరోయిన్ ని చూసిందట.

రానా అంటే ఇష్టం లేదా….

మహానటి గా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ సినిమాల అవకాశాలతో కళకళలాడుతుంది. అయితే కీర్తి సురేష్ ని రానా కి జోడిగా నటించమని సంప్రదించగా.. కీర్తి సురేష్ ‘నో’ చెప్పిందనే టాక్ ఫిలింసర్కిల్స్ లో వినబడుతుంది. మరి కీర్తి సురేష్ బిజీ షెడ్యూల్స్ వల్లే డేట్స్ ఖాలీ లేకనో… లేదంటే మారేదైన కారణమో రానా సరసన చెయ్యనని చెప్పడానికి అనేది తెలియాల్సి ఉంది.

 

 

 

 

Tags:    

Similar News