చివరికి ఆమె దిక్కా?

రంగ్ దే షూటింగ్ అవడమే తరువాయి నితిన్ బాలీవుడ్ రీమేక్ అంధధూన్ సినిమా షూటింగ్ కి రెడీ అయిపోతాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ అంధధూన్ రీమేక్ [more]

Update: 2020-08-30 07:09 GMT

రంగ్ దే షూటింగ్ అవడమే తరువాయి నితిన్ బాలీవుడ్ రీమేక్ అంధధూన్ సినిమా షూటింగ్ కి రెడీ అయిపోతాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ అంధధూన్ రీమేక్ కోసం తెగ వెయిట్ చేస్తున్నాడు. కళ్ళున్నా.. గుడ్డివానిగా నితిన్ అంధధూన్ రీమేక్ లో కనిపించబోతున్నాడు. అయితే ఈసినిమాలో ఓ కీలక పాత్ర కోసం మిడియం ఏజ్ ఉన్న హీరోయిన్స్ కోసం నితిన్ నానా కష్టాలు పడుతున్నాడు. అంధధూన్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న టబు పాత్ర కోసం చాలామంది మీడియం ఏజ్ హీరోయిన్స్ ని సంప్రదించినా వారు నో చెప్పడంతో చివరికి నితిన్ కి ఆమె దిక్కయ్యేలా కనబడుతుంది. 

ఆమె అంటే ఒరిజినల్ పాత్ర చేసిన టబునే నితిన్ అంధధూన్ లోను నటించే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. అసలు ముందుగానే టబు పాత్రని టబు తోనే చేయించాలనుకుంటే.. ఆమె భారీగా రెమ్యునరేషన్ అడగడంతో.. నితిన్ అండ్ కో మరో హీరోయిన్ కోసం వెతుక్కున్నారు. ఇలియానా దగ్గరనుండి.. శ్రియ, ప్రియమణి. నయనతార వరకు టబు పాత్రకీపేర్లు వినిపించినా.. వాళ్ళు భారీగా అడగడం అటుంచి.. చాలామంది ఆ పాత్రకి నో చెప్పడంతో.. చివరికి నితిన్ అండ్ కో టబు దగ్గరకే కాళ్లబేరానికి వచ్చినట్టుగా ఫిలింనగర్ టాక్. టబు ని ఎలాగోలా ఒప్పించే పనిలో ఉన్నారట. టబు పాత్రని టబు అయితేనే పర్ఫెక్ట్ గా చేస్తుంది అని నితిన్ అండ్ దర్శకుడు నమ్ముతున్నారట. అందుకే టబు ని ఒప్పించే ఏర్పాట్లలో ఉన్నారట.

Tags:    

Similar News