సైరాకు అక్కడ బజ్ లేదు

Update: 2018-04-05 09:19 GMT

చిరంజీవి 151వ చిత్రం దాదాపు వంద కోట్లు పైనే తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి పై తెలుగు రాష్ట్రాల్లో అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఆఫిషల్ గా ఓ లుక్ కూడా రిలీజ్ చేయలేదు టీం. కానీ సినిమాపై ఇప్పటివరకు నేషనల్ లెవెల్ లో బజ్ క్రియేట్ కాలేదు అంటూ కొందరు లెక్కలు కడుతున్నారు.

లేటెస్ట్ గా అమితాబ్ తన ట్విట్టర్ ఆకౌంట్ లో రెండుమూడు స్టిల్స్ రిలీజ్ చేసారు. ఐన కానీ సినిమాపై ఏ మాత్రం బజ్ క్రియేట్ కాలేదు. ప్రస్తుతం ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. షూటింగ్ కంప్లీట్ అయ్యాక అసలు ప్రమోషన్ స్టార్ట్ చేస్తారంట. అందుకే ఈలోపల జస్ట్ సైరా గురించి ఇంట్రో ఇచ్చేందుకు మాత్రమే ఈ పిక్చర్స్ ను బైటకు ఇచ్చారట.

బాహుబలి అప్పుడు కూడా ఇదే పరిస్థితి. బాహుబలి రిలీజ్ కు ముందు బాలీవుడ్ లో ఏం బజ్ లేదు. టీజర్ అండ్ ట్రైలర్ వచ్చాక.. దానిని హిందీలోకి తీసుకెళ్ళారు. అప్పుడు ఈ టెక్నిక్ బాగానే వర్కవుట్ అయింది. ఇప్పుడు సైరా సినిమా విషయంలో కూడా అంతే. షూటింగ్ అంత పక్క అయిపోయాకా హిందీలో బజ్ క్రియేట్ చేయనున్నారు. ఐన కంటెంట్ ఉండాలేకాని బజ్ అనేది ఏమీ మ్యాటర్ కాదు.

Similar News