సైరా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన చరణ్?

Update: 2018-05-08 10:10 GMT

ఉయ్యాలవడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రం 'సైరా'. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా అంచనాలు బాగానే ఉన్నాయ్. ఎందుకంటే బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ ఇందులో ఓ ప్రత్యేకమైన పాత్ర చేస్తున్నారు. అంతే కాకుండా కోలీవుడ్ నుండి విజయ్ సేతుపతి..నయనతారలు నటిచడంతో ఈ సినిమాపై అంచనాలు అదే రేంజ్ లో ఉన్నాయ్.

డైరెక్టర్ సురేంద్ర రెడ్డి కూడా టేకింగ్ విషయంలో ఎక్కడ కంప్రమైస్ కాకుండా పక్కా ప్లాన్ గా అంత సవ్యంగా జరుగుతోందని సమాచారం అందుతోంది. ఇక నిర్మాత రామ్ చరణ్ ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది కరెక్ట్ గా ఇదే సమయానికి 'సైరా' ను రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడంట. మే 9న చిరంజీవికి బాగా కలిసొచ్చిన డేట్ కావడంతో ఆ డేట్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ రోజున మెగాస్టార్ 'జగదేక వీరుడు అతిలోక సుందరి' - 'గ్యాంగ్ లీడర్' వంటి ఇండస్ట్రీ హిట్స్ సినిమాలు రిలీజ్ అయ్యాయి కాబట్టి 'సైరా' కూడా వచ్చే ఏడాది అదే తేదీన రావాలని డిసైడ్ అయ్యారు.

అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ వర్క్ చాలా పెండింగ్ లో ఉంది. పైగా ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యత గల సినిమా కావడంతో ఆ పనులకే సమయం ఎక్కువ పడుతుంది. అయితే 'సైరా' షూటింగ్ లో ఏ మాత్రం ఆలస్యం అయినా మళ్లీ సినిమా రిలీజ్ డేట్ పై ఎఫెక్ట్ పడుతుంది. ఉన్న షెడ్యూల్ ప్రకారమే వెళితే విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు స్పెషల్ యాక్షన్ సీన్స్ అన్ని కరెక్ట్ సమయానికి అయిపోతాయట. లేట్ అవ్వకూడదనే ఉదేశంతోనే సురేంద్ర రెడ్డి గ్రాఫిక్స్ టీమ్ తో సీన్ బై సీన్ వర్క్ ఫినిష్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. మరి చరణ్ అనుకున్న డేట్ కు సైరా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.

Similar News