సైరా క్లైమాక్స్ అదేనట..!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. యంగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నా ఈ సినిమా క్లైమాక్స్ [more]

Update: 2019-02-22 07:47 GMT

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’. యంగ్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నా ఈ సినిమా క్లైమాక్స్ ఇంతవరకు ఫైనల్ చేయలేదట దర్శకనిర్మాతలు. నరసింహారెడ్డి నిజజీవితం ఆధారంగా క్లైమాక్స్ తీస్తే సాడ్ ఎండింగ్ తో సినిమాని ముగించాల్సి వస్తుందని అప్పుడు ప్రేక్షకులు ఈ సినిమాను తిరస్కరించే అవకాశం ఎక్కువ ఉందని దీన్ని పక్కన పెట్టేసి వేరేది రాసుకున్నారట. ఆయన మరణంతో కాకుండా ఆయన స్ఫూర్తితో మళ్లీ ఎవరెవరు తిరుగుబాటు చేశారనే అంశాల ఆధారంగా క్లైమాక్స్ ఉంటే బాగుటుందని అనుకున్నారు కానీ దాన్ని సరిగా ఫైనల్ చేయలేదట.

అదే క్లైమాక్స్ ఫైనల్

ఇప్పుడు క్లైమాక్స్ తీయాల్సిన అవసరం వచ్చింది కాబట్టి దీన్నే ఫైనల్ చేసి తెరకెక్కించాలని తాజాగా చిత్ర బృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార, ప్రత్యేక పాత్రల్లో అమితాబ్‌ బచ్చన్‌, సుదీప్‌, జగపతిబాబు, విజయ్‌ సేతుపతి లాంటి స్టార్ హీరోస్ నటించడం విశేషం. రామ్ చరణ్ తన సొంత బ్యానర్ లో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News