సైరా సంగతి తేలేలా లేదు.. అందుకే కొరటాలతో..?

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా సినిమా షూటింగ్ ఇంకా గ్యాప్ లేకుండా నిర్విరామంగా సాగుతూనే ఉంది. ప్రస్తుతం జనేసేన తమ్ముళ్లకి, కాంగ్రెస్ కి [more]

Update: 2019-04-05 08:03 GMT

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న సైరా సినిమా షూటింగ్ ఇంకా గ్యాప్ లేకుండా నిర్విరామంగా సాగుతూనే ఉంది. ప్రస్తుతం జనేసేన తమ్ముళ్లకి, కాంగ్రెస్ కి అందుబాటులో లేకుండా 2019 ఎలక్షన్స్ కి దూరంగా చిరు సైరా షూటింగ్ కి బ్రేకిచ్చి మరీ.. భార్య సురేఖతో జపాన్ లో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. సైరా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందా? తన సినిమాని ఎప్పుడు పట్టాలెక్కిద్దామా అని కొరటాల శివ.. చిరు కోసం కాచుకుని కూర్చున్నాడు. మరి చిరుతో కొరటాల మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనేది నిన్నమొన్నటి వరకు అస్సలు సమాచారం లేదు.

దసరాకు విడుదల చేసేలా…

తాజాగా సైరా సినిమా షూటింగ్ మే కల్లా ఓ కొలిక్కి వస్తుందని.. ఇక జూన్ నుండి కొరటాల శివ – చిరు సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఇక సైరా కోసం చిరు షూటింగ్ పూర్తి కాగానే.. కొంచెం కూడా టైం వేస్ట్ చెయ్యకుండా చిరు కొరటాల సినిమా కోసం రెడీ అవుతాడట. అయితే మొన్నీమధ్యనే చిరు.. కొరటాల శివ సినిమా కోసం ఫోటో షూట్ లో పాల్గొన్నాడనే న్యూస్ నడిచింది. మరి అందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం కోరటాల శివతో చిరు జూన్ నుండి కొత్త సినిమా ప్రారంభించబోతున్నాడనేది మాత్రం లేటెస్ట్ న్యూస్. ఇక సైరాని ఎలాగైనా దసరా టార్గెట్ గా పూర్తి చేసి విడుదల చెయ్యాలని చూస్తున్నారు. త్వరలోనే సైరా డేట్ కూడా లాక్ చేస్తారంటున్నారు.

Tags:    

Similar News