`సైరా`లో ఆ సీన్ హైలైట్ అంట..!

కృష్ణ నటించిన అల్లూరి సీతారామ‌రాజు సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. అందులో కొన్ని డైలాగ్స్ రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటాయి. ముఖ్యంగా సీతారామ‌రాజు [more]

Update: 2019-03-18 08:58 GMT

కృష్ణ నటించిన అల్లూరి సీతారామ‌రాజు సినిమా అప్పట్లో ఎంత సెన్సేషన్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. అందులో కొన్ని డైలాగ్స్ రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంటాయి. ముఖ్యంగా సీతారామ‌రాజు బ్రిటీష్ వారి బుల్లెట్లకు ఎదురొడ్డి భారీ డైలాగ్ చెబుతాడు. ఆ డైలాగ్ కి ప్ర‌తి ఒక్కరి రోమాలు నిక్క‌బొడుస్తాయి. సేమ్ అలానే అలాంటి స‌న్నివేశ‌మే 'సైరా'లో కూడా చూడ‌బోతున్నామట. నరసింహారెడ్డి అప్పట్లో బ్రిటీష్ వారిపై పోరాడిన తొలిత‌రం యోధుడు. కొన్నేళ్ల పాటు బ్రిటీష్ వారిని గ‌డ‌గ‌డ‌లాడించాడు. చివరికి అతనికి బ్రిటిష్ వారు ఉరిశిక్ష విధించారు.

రెండు పేజీల డైలాగ్స్

ఉరిశిక్ష స‌మ‌యంలో నరసింహారెడ్డి బ్రిటీష్ వారిని ఉద్దేశించి కొన్ని డైలాగులు చెప్పించారు. ఆ డైలాగ్స్ కి థియేటర్స్ లో ఫ్యాన్స్ విజిల్స్ తో మోత మోగించడం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. దాదాపు 2 పేజీల నిడివి ఉన్న డైలాగ్‌ని చిరంజీవి అన‌ర్గ‌ళంగా ప‌లికాడ‌ట‌. సాయి మాధవ్ బుర్ర రాసిన ఈ డైలాగ్స్ సినిమాలో హైలైట్ గా నిలుస్తాయంట. ఆల్రెడీ క్లైమాక్స్ చిత్రీక‌ర‌ణ పూర్తి అయింది. ఆ సీన్ సినిమాలో బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్.

Tags:    

Similar News