సై రా పవర్ ఫుల్ డైలాగ్ ని లీక్ చేసిన రైటర్!

Update: 2018-08-25 06:51 GMT

మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా సైరా నరసింహారెడ్డి చిత్రం టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. టీజర్ ప్రక్షకుల్లో మంచి సినిమా పట్ల క్యూరియాసిటిని బాగా పెంచేసింది. అయితే ఈ సినిమాకి పరుచూరి సోదరులతో పాటు సాయిమాధవ్ కూడా తోడవడంతో.. అదరగొట్టే పవర్ ఫుల్ డైలాగ్స్ ఉంటాయనిపిస్తుంది. తాజాగా సై రా రైటర్స్ లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ సై రా పవర్ ఫుల్ డైలాగ్ ఒకటి లీక్ చేసాడు. ఆ డైలాగ్ వింటేనే ఉర్రూతలూగడం ఖాయంగా కనపడుతోంది.

పరుచూరి లీక్ చేయడంతో...

పరుచూరి లీక్ చేసిన ఆ డైలాగ్ చిరంజీవి నోటి వెంట వస్తుంది. ఇంతకీ ఆ పవర్ ఫుల్ డైలాగ్ ఎంటంటే... ‘‘చేతులు వెనక్కి విరిచి కట్టేశాం. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది. ఏంటిరా.? ఆ ధైర్యం.. చావు భయం లేదా నీకు.?’’ అని బ్రిటిష్ అధికారి అంటే.. ‘‘చచ్చి పుట్టినవాడిని.. చనిపోయిన తర్వాత కూడా బతికే వాడిని. చావంటే నాకెందుకురా భయం...’’ అంటూ చిరు చెప్పే డైలాగ్ సినిమాకే హైలెట్ అంటున్నారు పరుచూరి గోపాలకృష్ణ. మరి చూస్తుంటే సినిమాలో ఈ మాదిరి పవర్ ఫుల్ డైలాగ్స్ మరిన్ని ఉండేలా కనబడుతున్నాయి. ఇప్పుడు పరుచూరి లీక్ చేసిన సై రా డైలాగ్ సోషల్ మీడియాలో దావానంలా తెగ వైరల్ అయ్యింది.

Similar News