చిరు కోసం కాంప్రమైజ్ అవుతున్నారా..?

Update: 2018-09-18 08:12 GMT

చిరంజీవి సినిమాలు వదిలేసి రాజకీయాల్లో పడిన తర్వాత ఫిటెనెస్ ని పూర్తిగా వదిలేసాడు. బాగా బరువు పెరిగాడు. అయితే రాజకీయాల నుండి మళ్లీ సినిమాల్లోకి కంబ్యాక్ అయినప్పటికీ.. చిరు కాస్త ఒళ్లుతో కనబడ్డాడు. ఖైదీ నెంబర్ 150 లోనూ చిరంజీవి బాగా బరువుతో ఇబ్బంది పడ్డాడు. పాటల్లో స్టెప్స్ వేసేటప్పుడు యాక్షన్ సీక్వెన్సెస్ లో చిరు బరువు బాగా తెలిసింది. అయితే చిరు ఖైదీ తర్వాత సైరా నరసింహారెడ్డి పాత్ర కోసం బాగా జిమ్ చేసి కాస్త బరువు తగ్గించాడు. మరి ఆ సినిమాలో యంగ్ లుక్స్ లో, నడి వయస్సు పాత్రలో చిరు బాగా కనిపించాలి కాబట్టి కాస్త బరువు తగ్గించాడు.

ఇబ్బంది ప‌డుతున్న సురేంద‌ర్ రెడ్డి

మరి సైరా కోసం బరువు తగ్గినా చిరు మళ్లీ బాగా బరువు పెరిగిపోయాడట. షోల్డర్‌ సర్జరీ కారణంగా ఎక్సర్‌సైజ్‌కి దూరంగా వుండడం వల్ల చిరు అమాంతం మళ్లీ బరువు పెరిగిపోయారట. చిరంజీవి పెరిగిన బరువు వలన సైరాలో కొన్ని సన్నివేశాలు తీయడానికి దర్శకుడు సురేందర్ రెడ్డికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని... మరీ ముఖ్యంగా చిరంజీవిని యంగ్‌గా చూపించే సన్నివేశాలు అనుకున్నట్టుగా రావడం లేదని ఫిలిం సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే చిరు మళ్లీ అంతా సెట్ అయ్యాక వర్కౌట్స్ చేసాక మళ్లీ బరువు తగ్గించేస్తారని.. ఈ గ్యాప్ లో చిరు సైరా ఓల్డ్ గెటప్ కి సంబందించిన సీన్స్ షూట్ చేసారట. కానీ ఇప్పుడు చిరు బరువు తగ్గలేదట. ఇలాంటి టైం లో చిరు కోసం సైరా షూటింగ్ కి బ్రేకివ్వడం ఎలా అని సైరా యూనిట్ తర్జన భర్జన పడుతున్నారట.

గ్రాఫిక్స్ సాయంతో...

అయితే ఆనుష్క సైజు జీరో కోసం బాగా బరువు పెరగడం వలన బాహుబలిలో కొన్ని సీన్స్ తీసేటప్పుడు రాజమౌళి చాలా ఇబ్బంది పడడం.. చేసేదేం లేక గ్రాఫిక్స్ లో అనుష్కని సన్నగా చూపించడానికి ప్రయత్నించి సక్సెస్ కావడం జరిగాయి. అయితే ఇప్పుడు చిరు సైరా విషయంలోనూ చిరు కోసం అవసరమైన చోట్ల గ్రాఫిక్స్‌ సాయం తీసుకోవాలని సైరా టీం నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది. 200 కోట్లు పెట్టుబడితో తెరకెక్కుతున్న సైరా సినిమా విషయంలో ఎలాంటి గందరగోళం జరిగినా మొదటికే మోసం వస్తుంది కాబట్టి కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్నారట.

 

Similar News