సైరా గురువుగా అదరగొట్టాడుగా..!

Update: 2018-10-11 08:18 GMT

రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా భారీ బడ్జెట్ తో సైరా నరసింహారెడ్డి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో పలు భాషల నటీనటులు నటిస్తున్నారు. భారీ అంచనాలున్న సైరా నరసింహారెడ్డి టీజర్ తోనే మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. సైరా నరసింహారెడ్డి గా చిరు అదరగొట్టగా తాజాగా సైరా నరసింహారెడ్డి గురువుగా నటిస్తున్న అమితాబ్ బచ్చన్ లుక్ కూడా ఆయన పుట్టిన రోజు కానుకగా విడుదల చేసింది సైరా బృందం. అమితాబ్ 76వ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్‌ మోషన్‌ టీజర్‌ ను అధికారికంగా విడుదల చేసింది. ఈ సినిమాలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు గోసాయి వెంకన్నపాత్రలో అమితాబ్‌ ఆ లుక్ లో ఇరగదీస్తున్నాడు.

అరదగొడుతున్న మోషన్ పోస్టర్...

గుబురు గడ్డం, ఒత్తుగా ఎదిగిన మీసకట్టు, పాత్రకు తగ్గట్టే ఆ తలకట్టు, వెనక్కి దువ్విన గిరజాలు, నుదుటిన దిద్దిన తిలకం అన్ని అమితాబ్ రాజగురువుగా అద్భుతంగా కనబడుతున్నాయి. ఇక ఆ మోషన్ పోస్టర్ కి సంగీతం కూడా అదరగొట్టింది. మరి లుక్స్ తోనే సినిమాల మీద అంచనాలు పెంచుతున్న సైరా టీం ఇంకా వదిలే లుక్స్ మరిన్ని అంచనాలు పెరిగేలా కనబడుతున్నాయి. ప్రస్తుతం జార్జీయాలో సైరా సినిమా యాక్షన్ సీక్వెన్సెస్ ని సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సైరా నరసింహారెడ్డి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేసే యోచనలో సైరా మేకర్స్ ఉన్నారు.

Similar News