సైరా సంక్రాంతికి వస్తే పరిస్థితి ఏంటి..?

ఈ సమ్మర్ లో పెద్ద సినిమాల హడావిడి అయిపోయినట్టే. సూపర్ స్టార్ మహేష్ మహర్షి రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ [more]

Update: 2019-05-11 05:56 GMT

ఈ సమ్మర్ లో పెద్ద సినిమాల హడావిడి అయిపోయినట్టే. సూపర్ స్టార్ మహేష్ మహర్షి రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ నెల మొత్తం మీడియం, చిన్న సినిమాల జోరు ఉండనుంది. ఇక వచ్చే నెలలో ఎవరూ సినిమాలు రిలీజ్ చెయ్యరు. ఎందుకంటే వచ్చే నెల నుండి వరల్డ్ కప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఇక పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వాలంటే మ‌ళ్లీ దసరా రావాల్సిందే. ఈ నేపథ్యంలో దసరాకు రిలీజ్ అవ్వడానికి సైరా రెడీ అవ్వనుందని టాక్. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుందని చెబుతున్నారు. ఒకవేళ సంక్రాంతికి కనుక సైరా వస్తే చాలా ఇబ్బందే. ఎందుకంటే సంక్రాంతికి ఇప్పటి నుండే చాలా సినిమాలు క్యూ కట్టాయి.

ద‌స‌రాకే విడుద‌ల చేసేందుకు

బాలకృష్ణ మూవీ, అనిల్ రావిపూడి – మహేష్, బన్నీ – త్రివిక్రమ్, మారుతి – సాయిధరమ్ తేజ్, నాగ్ – కళ్యాణ్ కృష్ణ ఇలా చాలానే సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఒకవేళ సైరా సంక్రాంతికి వస్తే ఈ సినిమాలు అన్ని చెల్లాచెదురు అయిపోతాయి. అందుకే ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా సైరాను ఎట్టి పరిస్థితిల్లోనూ దసరాకు తీసుకురావాలని గట్టి ప్రయత్నం చేస్తున్నట్లు బోగట్టా. అక్టోబర్ 2ను డేట్ గా ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత రోజు నుండి దసరాకు వారం రోజులు సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు టాక్. ఇక సైరాకి పోటీగా సాహో కూడా రానున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News