సై రా లో ఈ పాపకి చోటుంటుందా..?

Update: 2018-08-17 08:03 GMT

ఈ మధ్యన సినిమాల కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్ అయిన హీరోయిన్ పూనమ్ కౌర్ కి పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందానికి అందం, గ్లామర్ కి గ్లామర్... దర్శకుడు ఎలా కావాలంటే అలా అందాలు ఆరబోయ గల పూనమ్ కౌర్ కి అదృష్టం పెద్దగా కలిసి రాలేదు. అందుకే స్టార్ హీరోయిన్ కాలేకపోయింది. కనీసం సపోర్టింగ్ రోల్స్ తో అయినా బిజీ అవుదామనుకుంటే... అందులోను ఛాన్స్ లు రావడం లేదు. కానీ తాజాగా పూనమ్ మెల్లిగా ఫామ్ లోకొస్తుంది. హీరోయిన్ గా కాదు గాని.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పూనమ్ కొంచెం కొంచెం బిజీగా మారుతుంది.

సైరాలో అవకాశం..?

ఇప్పటికే ఈటివిలో ప్రసారమవుతున్న స్వర్ణ ఖడ్గం సీరియల్ లో కీ రోల్ పోషిస్తున్న పూనమ్ కౌర్ గత వారం విడుదలైన శ్రీనివాస కళ్యాణం సినిమాలో ప్రకాష్ రాజ్ పెద్ద కూతురుగా.. హీరోయిన్ రాశి ఖన్నా అక్కగా నటించింది. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మరో బిగ్ ప్రాజెక్ట్ లో పూనం కౌర్ కి ఒక అవకాశం వచ్చిందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకుడిగా రామ్ చరణ్ నిర్మాతగా తెరకెక్కుతున్న సై రా నరసింహారెడ్డి సినిమాలో పూనమ్ కౌర్ ని ఒక ముఖ్యమైన పాత్ర కోసం ఎంపిక చేసినట్లుగా తెలుస్తుంది.

సపోర్టింగ్ రోల్ లోనే..!

ఇప్పటికే సైరా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న టైం లో పూనమ్ కౌర్ ని ఓ కీ రోల్ కోసం ఎంపిక చెశారని చెబుతున్నారు. మరి సై రా నరసింహారెడ్డి సినిమా లో పలు భాష నటీనటులు నటిస్తున్నారు. ఇండియాలోని పలు భాషల్లో విడుదలవుతున్న సై రా కోసం ఇప్పటికే నయనతార, తమన్నాలు హీరోయిన్స్ గా ఎంపికయ్యారు. ఇప్పుడు హీరోయిన్ రోల్ కాకపోయినా.. సపోర్టింగ్ రోల్ కి పూనమ్ కౌర్ ని తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక సై రా సినిమాలో పూనమ్ కనిపించనుండటం ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.

Similar News