సై రా నరసింహారెడ్డిలో బన్నీ..?

Update: 2018-08-09 06:17 GMT

నా పేరు సూర్య సినిమా తర్వాత మరో సినిమాని అల్లు అర్జున్ ఇప్పటివరకు మొదలు పెట్టలేదు. విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ సినిమ ఇదిగో అదిగో అంటున్నారు కానీ పట్టాలెక్కడం లేదు. సినిమా కథలోని మర్పులను చేర్పులను బన్నీకి అనుకూలంగా విక్రమ్ చేయలేకపోవడం వలెనే ఈ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కే ఛాన్స్ లేదని... స్వయంగా అల్లు అర్జున్ చెబుతున్నాడు. నా సినిమా మరింత లేట్ అవుతుంది అభిమానులు శాంతించండి అని. అయితే అల్లు అర్జున్ తాజాగా సై రా నరసింహారెడ్డి లో ఒక అతిథి పాత్రలో మెరవబోతున్నాడనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది.

మరో గోన గన్నారెడ్డి...

మరి ఇది వరకు చిరు సినిమాల్లో అల్లు అర్జున్ చిన్న పాత్రల్లో కనిపించాడు. డాడీ సినిమాలో డాన్సర్ గా, శంకర్ దాదా జిందాబాద్ లో ఒక పాటలో స్టెప్స్ వేసాడు. ఇక గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా అతిధి పాత్రే అయినప్పటికీ.... ఆ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర ఎంతో కీలకమే కాదు.. ఆ సినిమా లో అల్లు అర్జున్ నటనకు... అల్లు అర్జున్ మాట్లాడిన తెలంగాణ భాషకు అందరూ పడిపోయారు. మరి రుద్రమదేవిలో చేసిన గోన గన్నారెడ్డి పాత్ర వంటి పాత్రే సై రా లో అల్లు అర్జున్ చెయ్యబోతున్నాడంటూ.. ఒక వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

ఇప్పటికే రంగంలోకి మహామహులు

అయితే సురేందర్ రెడ్డి కోరిక మేరకు, చిరు మీద అభిమానంతో అల్లు అర్జున్ సై రా సినిమాలో ఒక పాత్ర చెయ్యడం పక్కా... అని ఇక కేవలం అధికారిక ప్రకటన రావడమే తరువాయి అంటున్నారు. మరి ఇప్పటికే సై రా నరసింహారెడ్డి కోసం మహామహులు రంగంలోకి దిగారు. అమితాబ్, సుదీప్, విజయ్ సేతుపతి.. ఇలా పరభాషల్లో మేటి నటులు మాత్రమే కాకుండా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అంటే నిజంగానే సై రా నరసింహారెడ్డిపై మరిన్ని అంచనాలు పెరుగుతాయనడంలో సందేహమే లేదు. ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న సైరా నరసింహారెడ్డి చిత్ర బృందం త్వరలోనే ఫారిన్ వెళ్లనుంది.

Similar News