ప్రభాస్ తో అప్పుడు మిస్ అయిన ఛాన్స్ ఇప్పుడు వస్తుందా?

రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ తో అశోక్ సినిమా ఎలా చెయ్యాల్సి వచ్చిందో చెప్పి సై రా దర్శకుడు సురేందర్ రెడ్డి అందరికి షాకిచ్చాడు. ఎన్టీఆర్ బలవంతం [more]

Update: 2019-11-21 04:29 GMT

రెండు రోజుల క్రితం ఎన్టీఆర్ తో అశోక్ సినిమా ఎలా చెయ్యాల్సి వచ్చిందో చెప్పి సై రా దర్శకుడు సురేందర్ రెడ్డి అందరికి షాకిచ్చాడు. ఎన్టీఆర్ బలవంతం మీదే అశోక్ సినిమా చెయ్యాల్సి వచ్చింది అంటూ మాట్లాడి హాట్ టాపిక్ అయిన సురేందర్ రెడ్డి…. ఎన్టీఆర్ వల్లనే ప్రభాస్ తో అవకాశం మిస్ చేసుకున్నా అన్నాడు. కళ్యాణ్ రామ్ తో అతనొక్కడే సినిమా చేసాక.. ప్రభాస్ తో సినిమా చేసేందుకు కథ రాసుకున్న తనకి ఎన్టీఆర్ మేనేజర్ తగిలి ఎన్టీఆర్ తో అశోక్ సినిమా చేయించడం వలన ప్రభాస్ తో సినిమా మిస్ చేసుకున్నా అంటూ ప్రభాస్ సింపతీ కోసం మాట్లాడినట్టుగా మాట్లాడాడు.

అయితే సురేందర్ రెడ్డి అశోక్ చేసిన ఇన్నాళ్లకి ఇలా మట్లాడడం విడ్డురమనిపించినా… ప్రభాస్ తో తన నెక్స్ట్ సినిమా కోసం ఇలా మాట్లాడడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సురేందర్ రెడ్డి పై ఫైర్ అవుతున్నారు. సై రా సినిమా తర్వాత సురేందర్ రెడ్డి, ప్రభాస్ కోసం ట్రై చేస్తున్నాడనే ప్రచారం ఉంది. అయితే ప్రభాస్ తనకి ఛాన్స్ ఇస్తాడో లేదో అంటూ సురేందర్ రెడ్డి ముందే ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. ప్రభాస్ సింపతీ కొట్టడానికి ట్రై చేస్తున్నాడని అంటున్నారు. మరి సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ విషయంలో ఇలా మాట్లాడిన తర్వాత కూడా సురేందర్ రెడ్డికి ప్రభాస్ ఛాన్స్ ఇస్తాడో… లేదో.. చూద్దాం

Tags:    

Similar News