శ్వేతా బసు ఇలా తయారైందేంటి..?

Update: 2018-05-31 07:57 GMT

'కొత్త బంగారు లోకం' మూవీతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన శ్వేతా బసు ప్రసాద్.. తర్వాత తెలుగు, తమిళ్ లో కొన్ని సినిమాల్లో కనిపించింది. కొన్ని కారణాల వల్ల హైదరాబాద్ వదిలి ముంబైకి వెళ్లి అక్కడ బాగానే సెటిల్ అయింది ఈ బ్యూటీ. ఆ మధ్య బాలీవుడ్ లో 'బద్రీనాథ్ కి దుల్హనియా' అంటూ కనిపించిన శ్వేతాబసు.. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ వచ్చింది.

వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం...

ఈసారి ప్రొఫెషనల్ గానే హైదరాబాద్ కి వచ్చింది ఈ భామ. అమెజాన్ ప్రైమ్ వారు నిర్మిస్తున్న 'గ్యాంగ్ స్టార్స్' అనే వెబ్ సిరీస్ జూన్ 1 నుంచి ప్రసారం కానుంది. మొత్తం 10 ఎపిసోడ్స్ సిరీస్ గా వస్తున్న గ్యాంగ్ స్టార్స్ లో ఔత్సాహిక నిర్మాతగా శ్వేతా బసు కనిపించబోతోంది. ఈ సిరీస్ కు సంబంధించి ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది శ్వేతా బసు.

కొత్త లుక్ లో...

అయితే ఈసారి మరింత అందంగా సరికొత్త లుక్ తో ఎంట్రీ ఇచ్చింది. గతంలో కాసింత బొద్దుగా కనిపించిన ఈ భామ.. ఇప్పుడు బాగానే చిక్కింది. కొద్దిగా గ్లామర్ ను చూపిస్తూ.. స్లీవ్ లెస్ డ్రెస్సులో గ్యాంగ్ స్టర్స్ కి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది శ్వేత బసు ప్రసాద్.

Similar News