విజయ్ ప్లేస్ లోకి నాని ?

నాని కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ చిత్రంగా నిలిచింది ‘అలా మొదలైంది’ చిత్రం. ఈ చిత్రంను ఒక లేడీ డైరెక్టర్ అయిన నందిని రెడ్డి [more]

Update: 2019-10-12 07:53 GMT

నాని కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ చిత్రంగా నిలిచింది ‘అలా మొదలైంది’ చిత్రం. ఈ చిత్రంను ఒక లేడీ డైరెక్టర్ అయిన నందిని రెడ్డి డైరెక్ట్ చేసి అందరిని ఆశర్యపరిచారు. యూత్ ఫుల్ సబ్జెక్ట్ తో ఎక్కడ బోర్ కొట్టకుండా తీసినా నందిని ఈ సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు. ఇక రీసెంట్ గా ఈమె సమంత తో ‘మిస్ గ్రానీ’ని ‘ఓ బేబీ’గా రీమేక్ చేసి ఓ మోస్తరు విజయాన్నందుకుందామె.

కథా నాయకుడెవరో….

ఇక నెక్స్ట్ ఈమె చేయబోయే చిత్రం ఏంటో కూడా ప్రకటన వచ్చేసింది. కొన్నేళ్ల కిందటే వైజయంతీ మూవీస్ అనుబంధ ప్రొడక్షన్ సంస్థ ‘స్వప్న సినిమా’కు ఒక మూవీ కమిటైంది నందిని. రీసెంట్ గా ఈ బ్యానర్ వాళ్ళు నందిని రెడ్డి తో తమ నెక్స్ట్ సినిమా అని అనౌన్స్ చేసారు కానీ హీరో ఎవరు అనేది మాత్రం చెప్పలేదు.

నాని….నందిని

నిజానికి విజయ్ దేవరకొండ ఈ బ్యానర్ లో నందిని రెడ్డి తో ఓ సినిమా చేయాల్సివుంది కానీ అది సడన్ గా ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం నాని హీరోగా నందిని రెడ్డి సినిమా చేస్తున్నారు అని తెలుస్తుంది. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా చేస్తున్న ఓ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ తరువాత నాని నందిని రెడ్డి తో చేసే అవకాశముంది.

 

 

Tags:    

Similar News