విజయ్ కోసం నలుగురు భామలు రెడీ అంటున్నారా

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాకోసం పూరి జగన్నాధ్ పాన్ ఇండియా హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఫైటర్ తో గ్రాండ్ [more]

Update: 2019-12-11 06:07 GMT

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఫైటర్ సినిమాకోసం పూరి జగన్నాధ్ పాన్ ఇండియా హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ ఫైటర్ తో గ్రాండ్ గా లాంచ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా కోసం పూరి జగన్నాథ్ హీరోయిన్ వేటలో ఉండడమే కాకుండా…. ఫైటర్ ని పాన్ ఇండియా ఫిలింగా మార్చడానికి స్క్రిప్ట్ ని మార్చబోతున్నాడు. అయితే విజయ్ దేవరకొండ క్రేజ్ కి ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్స్ ఫిదా అవుతున్నారు. జాన్వీ కపూర్ దగ్గరనుండి, కియారా అద్వానీ, అలియా భట్ ఇలా అంతా రౌడీ గారి స్టయిల్ కి పడిపోయిన ముద్దుగుమ్మలు. ఇక విజయ్ కోసం బాలీవుడ్ లో గట్టిగా పనిమొదలెట్టిన కరణ్ జోహార్ స్కూల్ లోనే ఈ ముగ్గురు హీరోయిన్స్ ఫిల్మీ పాఠాలు నేర్చారు.. కాబట్టి విజయ్ దేవరకొండ తో అవకాశం అంటే ఎగిరి గంతేయ్యడం ఖాయమే. అయితే ఈ ముగ్గురు హీరోయిన్స్ తోడు సారా అలీ ఖాన్ పేరు కూడా విజయ్ సరసన నటించే హీరోయిన్స్ లిస్ట్ లో చేరింది.

అయితే అలియా భట్ మాత్రం బాలీవుడ్ బడా సినిమాలే కాకుండా టాలీవుడ్ బడా మూవీ #RRR సినిమాలో నటిస్తూ యమా బిజీగా వుంది. మరో పక్క కియారా అద్వానీ కి కబీర్ సింగ్ మహిమ … బాలీవుడ్ అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంది. అలాగే సారా అలీఖాన్ కూడా బిజినె. మరో పక్క శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఓ రెండు సినిమా ల్తో బిజీగా వుంది. మరి జనవరి నుండి సెట్స్ మీదకెళ్ళబోయే ఫైటర్ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ఈ నలుగురి భామల్లో ఎవరు సెట్ అవుతారో? లేదా పూరి సౌత్ హీరోయిన్ తోనే పనికానిచ్చేస్తాడా? అనే సస్పెన్స్ కి ఎప్పుడు తెరపడనుందో అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు

Tags:    

Similar News